వరంగల్, 12,డిసెంబర్ 2025: ఈ నెల 21వ తేదీ ఆదివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ జాతీయ మెగా లోక్ ఆదాలత్ సంబందించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం విడుదల చేశారు
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ
ఈ నెల 21, ఆదివారం రోజున జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో
° క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,
° సివిల్ తగాదా కేసులు,
° ఆస్తి విభజన కేసులు,
° కుటుంబపరమైన కేసులు,
° వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,
° బ్యాంకు రికవరీ,
° విద్యుత్ చౌర్యం,
° చెక్ బౌన్స్
మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపినారు. రాజీయే రాజ మార్గమన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అని పోలీస్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం వరంగల్ ఏ. ఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్ స్పెక్టర్లు రమేష్, కరుణాకర్ పాల్గొన్నారు.
–


You are my breathing in, I own few web logs and infrequently run out from to post : (.