ప్రత్యూష శవం మీద పెట్టిన ఐసు గడ్డ కరిగినంత సేపు కూడా చట్టం,న్యాయం ఆమె వైపు నిలబడలేదు. బక్క తురకోడి కోవా బన్ను మీద పెంట పురుగుల్లా పడిచస్తాం తప్ప ఇలాంటి వ్యవస్థీకృత హత్యల మీద అసలే నోరు విప్పం
ఆ అఘాయిత్యానికి కనీస న్యాయం దక్కడానికి ఇరవై నాలుగేళ్ళు పట్టింది.
సిగ్గూ ఎగ్గూ లేని రాజ్యం ఒక అందమైన కలల ప్రపంచానికి బలవంత ముగింపు పలికారు. సినీ వినీల ఆకాశం లో ఒక మెరుపై మెరుద్దామని కలలు కన్న ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసారు కోటి ఆశతో రంగుల ప్రపంచం లో అడుగుపెట్టిన ఆమెను అధఃపాతాళం లోకి నెట్టేశారు
ప్రత్యూష తెలంగాణ ఆడబిడ్డ
ఆమె మీద పడి సంపన్న ఐశ్వర్యం నక్కల్లా పీక్క తిన్నారు. ఇందులో పోలీసులు,మంత్రులు, వాళ్ళ పిల్లలు కార్పొరేట్ హాస్పిటల్స్ అందులో డాక్టర్లు అందరూ పాపులే
ఆమెను అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి నోట్లో విష0 పోసి చంపి అందులో
ఒక బకరా గాణ్ణి ఇరికించి మిగతా అందరూ దేశాలు వదిలి పారిపోయారు.
ఆమె ప్రేమికుడి గా చెప్పబడుతున్న మనిషి చావలేదు
కానీ ఆమె మాత్రం చంపబడింది. ఇందులో చట్టం తన పని తాను చేసుకుంది
సహజంగా నే చట్టం, న్యాయం సంపన్నుల కాపలా కుక్కలా పనిచేసింది
కానీ ప్రత్యూష శవం మీద పెట్టిన ఐసు గడ్డ కరిగినంత సేపు కూడా న్యాయం ప్రత్యూష వైపు నిలబడలేదు
ఈ కేసు వాదించిన తారకం సర్ డైరీలు ఈ మధ్య చదివా.
అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం 2002 ఫిబ్రవరీ 23 న జరిగిన ఘటన. ఇరవై నాలుగున మహా ఘనత వహించిన కేర్ హాస్పిటల్ కు చేరింది.
ఆమె వంటిమీద 13 చోట్ల గాయాలు ఉన్నాయని ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పాడు.
మహా ఘనత వహించిన దేవేందర్ గౌడ్ లు మాధవ రెడ్లు అందునా చట్టం న్యాయం అరవై ఆరు పాదాల మీద నడిపిన బాబొరి పాలనా కాలం అది
బంజారా హిల్స్ , పంజాగుట్ట అది మా పరధి కాదు అనే బంతాటలో నలిగిపోయింది ప్రత్యూష బాధ్యత కలిగిన హాస్పిటల్ ఆమె దుస్తులను బద్రపరచడం ప్రోటోకాల్ నియమం కానీ అప్పటికి అప్పుడే హాస్పిటల్ లో ఆమె దుస్తులను కాల్చేసి న్యాయాన్ని నిలబెట్టారు అభినవ ధన్వంతర్లు.
గాంధీ హాస్పిటల్ ఒక రిపోర్ట్ ఫోరెన్సిక్ లాబ్ మరొక రిపోర్ట్
ఒక డాక్టర్ ఆమె వంటిమీద గాయాలు ఉన్నాయి అని చెప్పడం
మరొక డాక్టర్ వైద్యం లో బాగంగా పెట్టిన గాట్లు అనడం మొత్తంగా సకల రాజ్య వ్యవస్థలు ఆమెను ఏకాకిని చేశాయి
అన్ని వ్యవస్థలు కలిసి హత్యను ఆత్మ హత్యగా మార్చారు
యే మహిళా సంఘం నోరు విప్పలేదు హక్కుల సంఘాలు నామమాత్రంగా నే స్పందించాయి
హంతకుడికి కింది హైదరాబాద్ మెట్రో సెషన్స్ , హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు కు చేరడానికి పాతికేళ్లు పట్టింది
ముందు ఇదేళ్లు ఇప్పుడు రెండేళ్ళు అంతే ఒక అందమైన అమ్మాయిని అత్యాచారం హత్య చేసినందుకు మహా ఘనత వహించిన చట్టం ఇచ్చిన గిఫ్ట్
సినిమా సమాజమే హంతక స్వభావం కలిగినది. ఈ అమ్మాయికి బాబుల డాబు గిరి లేదు ప్రవర అసలే లేదు . నిత్యం జరిగే హత్యల అత్యాచారాల పరంపర లో ఇదొకటి
ఒక్క నటుడు నోరు విప్పలేదు ఇది అన్యాయం అని అనలేదు
అసలేవరు హంతకులు ఇందులో
ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని అర్ధాంతరంగా కుదించారు
ప్రత్యూష కేసులో మనమంతా దోషులమే
ఆ తల్లికి సమాజం మొత్తం బాకీ ఉంది
మన సమాజానికి సెలెక్టివ్ అంనీషియ అన్నీ మర్చిపోయినట్టు నటిస్తాం
బక్క తురకోడి కోవా బన్ను మీద పెంట పురుగుల్లా పడి చస్తాం తప్ప ఇలాంటి వ్యవస్థీకృత హత్యల మీద అసలే నోరు విప్పం
ఐసు గడ్డ కరిగినంత సేపు కూడా చట్టం,న్యాయం ఆమె వైపు నిలబడలేదు


Thanks for another informative web site. Where else could I get that kind of information written in such a perfect way? I have a project that I’m just now working on, and I’ve been on the look out for such info.
I like the valuable information you provide in your articles. I will bookmark your blog and check again here frequently. I am quite sure I will learn a lot of new stuff right here! Good luck for the next!
188v fan mang đến dịch vụ chăm sóc khách hàng chuẩn 5 sao, phục vụ tận tình mọi lúc mọi nơi kể cả ngày lễ tết. TONY05-08