Headlines

చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

వరంగల్ నగరంలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన నిందితులు:

  1. కొడుపాక నరేష్ (42), ఘవాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా
  2. వెల్పుల యాదగిరి (32), శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

గత డిసెంబర్ 28న తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడు, ఐదు నెలల వయసున్న మల్లన్నను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా కాజీపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. నేరస్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించారు. శుక్రవారం ఉదయం అద్దె కారులో మరోసారి చిన్నపిల్లలను కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

విచారణలో వీరు డిసెంబర్ 28న ఐదు నెలల బాలుడు మల్లన్నను కిడ్నాప్ చేసినట్టు, గతంలో మరో నాలుగు చిన్నపిల్లలను కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నారు. పిల్లలు లేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చిన పిల్లలని చెప్పి డబ్బులకు అమ్మినట్టు తెలిపారు.

వీరు కిడ్నాప్ చేసిన పిల్లల వివరాలు:

  • 2025 ఆగస్టులో వరంగల్ రైల్వే స్టేషన్‌లో 10 నెలల పాప – మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో విక్రయం
  • 2023 అక్టోబర్‌లో కాజీపేట రైల్వే స్టేషన్‌లో మూడు సంవత్సరాల బాలుడు – జన్నారం మండలంలో విక్రయం
  • 2025 అక్టోబర్‌లో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు 5 నెలల పాప – మంచిర్యాలలో విక్రయం
  • 2025 జూన్‌లో రామగుండం రైల్వే స్టేషన్ ముందు 10 నెలల పాప – జగిత్యాల జిల్లాలో విక్రయం

నిందితులలు వెల్లడించిన వివరాల మేరకు కాజీపేటలో కిడ్నాప్ అయిన మల్లన్నతో పాటు మిగతా నలుగురు పిల్లలను పోలీసులు రక్షించారు. చట్టబద్ధ ఆధారాలు లేకుండా పిల్లలను కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయసారు.

చిన్నపిల్లల కిడ్నాప్ కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.

ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీలు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం