కిట్స్ వరంగల్ యన్ యస్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్ ,ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, డా. సిహెచ్. సతీష్ చంద్రకు సన్మానం
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసీమియా దినోత్సవం పురస్కరించుకొని హనుమకొండ రెడ్ క్రాస్ భవన్ లో పాలకవర్గం రక్తదాణ శిబిరాల నిర్వహణలో సేవలందించిన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రక్తదాన శిబిరాల నిర్వహణ కేటగిరిలో కిట్స్ వరంగల్ ద్వారా మెగా రక్తదాన శిబిరం నిర్వహించి 541 రక్తం సేకరించి రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి అందచేసినందుకు యన్ యస్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. సతీష్ చంద్ర ను శాలువా, షీల్డ్ తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ వారు కిట్స్ వరంగల్ వారికీ కృతఙ్ఞతలు తెలియచేసినారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజి ఎంపీ, కిట్స్‌డబ్ల్యూ చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు , కిట్స్ వరంగల్ యాజమాన్య సభ్యులు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, కమీషనర్ అఫ్ పోలీస్, వరంగల్ : సన్ ప్రీత్ సింగ్, హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే & కిట్స్‌డబ్ల్యు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ , ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, ఐ ఆర్ సి యస్ ఛైర్మన్, డా. పి. విజయచందర్ రెడ్డి యన్ యస్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, డా. సిహెచ్. సతీష్ చంద్ర ను అభినందించారు.


This is very attention-grabbing, You are an excessively professional blogger. I have joined your rss feed and look forward to searching for extra of your fantastic post. Also, I’ve shared your site in my social networks!
Thanks a bunch for sharing this with all people you really know what you are speaking approximately! Bookmarked. Please additionally seek advice from my web site =). We can have a link exchange arrangement among us!