Headlines

టీటీడి గుడ్ న్యూస్

అక్టోబర్ 2026లో తిరుమల దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా?
టీటీడీ దర్శనం, అర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్, అంగప్రదక్షిణం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ విడుదల తేదీలు ప్రకటించింది. పూర్తి షెడ్యూల్ తెలుసుకొని అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోండి.

అక్టోబర్ 2026 టీటీడీ దర్శనం, వసతి టికెట్ల షెడ్యూల్ విడుదల


అక్టోబర్ నెల శ్రీ‌వారి దర్శనం, సేవలు, వసతి కోటాల విడుదల షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ

•  టీటీడీ అక్టోబర్ 2026
•  తిరుమల దర్శనం
•  టీటీడీ టికెట్లు
•  తిరుమల వసతి
•  ప్రత్యేక ప్రవేశ దర్శనం
•  అర్జిత సేవలు
•  శ్రీవాణి ట్రస్ట్
• అక్టోబర్ 2026 దర్శనం, వసతి కోటాల ఆన్‌లైన్ విడుదల షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ


తిరుమల, జూలై 12: అక్టోబర్ 2026 నెలకు సంబంధించిన శ్రీ‌వారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాల్లో టికెట్లు మరియు వసతి గదులను బుక్ చేసుకోవాలని సూచించింది.
టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ నమోదు జూలై 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు జూలై 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారు జూలై 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్లను జూలై 21 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచనున్నారు.
అంగప్రదక్షిణం టోకెన్లను జూలై 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్ల కోటాను జూలై 24 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
దర్శనం, సేవలు, వసతి గదుల బుకింగ్‌ను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం