Headlines

ఐ ఎల్ పి ఎ 6వ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్

వరంగల్ జిల్లా కోర్టులో ప్రెస్ మీట్

 హనుమకొండ జిల్లా కేంద్రం 'డి' కన్వెన్షన్ లో ఈ నెల నవంబర్ 14 న జరుగు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్  తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సదస్సు కన్వీనర్ చిల్ల రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ కోర్టు ఆవరణలో  న్యాయవాదులు, ఐ ఎల్ పి ఎ నాయకులతో కలిసి గోడ పత్రికలను,  ఆవిష్కరించి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ పిలుపునిచ్చిన 'పే బ్యాక్ టు సొసైటీ' లక్ష్యంగా నల్ల కోట్లతో నీలి విప్లవం నినాదంతో  ఐ ఎల్ పి ఎ పనిచేస్తుందని మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో నిరంతరం బహుజన అణగారిన పేద న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తూనే బహుజన సమాజ చైతన్యం కోసం పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సదస్సు కో కన్వీనర్ తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ సాంస్కృతిక విప్లవం విజయవంతం కాకుండా బహుజన సమాజ విముక్తి జరగదని, భారత రాజ్యాంగం న్యాయవాదులకు ఉపయోగపడే గ్రంథమే కాదని బడుగు బలహీన వర్గాల  జీవితాలను మార్చే స్ఫూర్తిదాయక వాహనమని అలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామగ్రామానికి తీసుకెళ్లడమే ఐ ఎల్ పి ఎ లక్ష్యమని ఆయన అన్నారు. అణగారిన వర్గ న్యాయవాదులకు, ప్రజలకు ఐ ఎల్ పి ఎ మార్గదర్శిగా పనిచేస్తుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ బి.సి మోర్చా జాతీయ అధ్యక్షులు చౌదరి వికాస్ పటేల్ అధ్యక్షతన జరుగు రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా విశ్రాంత హై కోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమీషన్ కమీషనర్ జస్టిస్ ఈద తిరుమలదేవి హాజరవుతున్నారని, గౌరవ అతిధులుగా వరంగల్, హనుమకొండ జిల్లా జడ్జిలు వి.బి. నిర్మలా గీతాంబ, ఎం.ఆర్. సునీత లు, పంచాయతీ రాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క, వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హాజరవుతున్నారని తెలిపారు. 79 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మహిళా స్వేచ్ఛ అనే అంశంపై ప్రొఫెసర్ ఇ. సుధారాణి, ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనే అంశంపై ప్రొఫెసర్ గుగులోతు వీరన్న నాయక్, సామాజిక న్యాయం – బహుజనుల ఐక్యత అనే అంశంపై తెలుగు అకాడమీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రజాస్వామ్యంలో జడ్జీల నియామకం – లోపాలు అనే అంశంపై ఐ ఎల్ పి ఎ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ ఉపన్యాసాలు ఇస్తారని తెలిపారు. వీరితో పాటు ఐ ఎల్ పి ఎ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్ జె శాంసన్, బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాసురాం నాయక్, రాష్ట్రీయ ముక్తి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ మహమ్మద్ ఫహీమొద్దీన్, బ్యాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి నరేందర్ తదితర మేధావులు హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర కమిటి సలహాదారు బండి మొగిలి, సభ్యులు ఎగ్గడి సుందర్ రామ్, జన్ను పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విలాసాగరం సురేందర్ గౌడ్, గురిమిల్ల రాజు, ఐ ఎల్ పి ఎ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పులిగిల్ల బిక్షపతి, చింత సాంబశివరావు, ఐ ఎల్ పి ఎ హనుమకొండ బార్ అధ్యక్ష కార్యదర్శులు పూసపెల్లి శ్రీనివాస్, నాంసాని చంద్రశేఖర్, ఐ ఎల్ పి ఎ వరంగల్ బార్ అధ్యక్ష ప్రధాన ప్రధాన కార్యదర్శులు పెండ్యాల అనిల్, అనుమాండ్ల రాజ్ కుమార్, ఐ ఎల్ పి ఎ జిల్లా నాయకులు జన్ను ప్రభాకర్, కలకోటి మహేందర్, అబ్దుల్ నభి, కట్కూరి సూరయ్య, అఖిల్ పాషా, కృష్ణ, గట్టు రవి తదితరులు హాజరయ్యారు.

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం