అమరావతి, మే 10, 2025: ఏ హోదా ఉన్నవారైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టమైన సంకేతం ఇస్తూ సుప్రీం కోర్టు ఓ ప్రభుత్వ అధికారిని డిమోట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహనరావును తహసీల్దార్ హోదాకు డిమోట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013లో తహసీల్దార్‌గా గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అడవితక్కెళ్లపాడు ప్రాంతంలో గుడిసెలను తొలగించిన ఘటనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఈ అంశాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం, హైకోర్టు అప్పట్లో మోహనరావుకు విధించిన 2 నెలల జైలు శిక్షను సవరిస్తూ, ఆయనను డిప్యూటీ కలెక్టర్ పదవి నుంచి తహసీల్దార్ హోదాకు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, మోహనరావు తరఫు న్యాయవాదులు, ఆయన జైల్లో 48 గంటల కంటే ఎక్కువ కాలం గడిపితే ఉద్యోగం కోల్పోతారనే ఆందోళనతో, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శిక్షను సవరించాలని కోరారు.
ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు, మోహనరావు తాను చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలని పేర్కొంటూ, కానీ జైలు శిక్షను ఉపసంహరించి, హోదా తగ్గిస్తూ తీర్పు ఇచ్చారు. దీనితోపాటు, పేదల ఇళ్ల నిర్మాణ నిధిగా నాలుగు వారాల్లోగా రూ.1 లక్ష జరిమానా చెల్లించి, ఆ రసీదును కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. ఇకపై పదోన్నతుల విషయంలో ఆయన సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జైలు శిక్ష తప్పించుకునేందుకు మోహనరావు తహసీల్దార్ స్థాయి పదవిని స్వీకరించాలని పూర్వంలో కోర్టు సూచించినప్పటికీ, అప్పట్లో ఆయన అంగీకరించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ గవాయ్, “ఆయన తొలిదశలోనే అంగీకరిస్తే 2–3 ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టే అవకాశముండేది. కానీ నాలుగు వాయిదాల వరకూ కేసు లాగించారు. ఇక నిరాకరించి ఉంటే, ఏ ప్రభుత్వం చేయలేని నిర్ణయం తీసుకునే స్థితిలో మేమున్నాం,” అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహనరావును తహసీల్దార్ హోదాకు డిమోట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013లో తహసీల్దార్‌గా గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అడవితక్కెళ్లపాడు ప్రాంతంలో గుడిసెలను తొలగించిన ఘటనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఈ అంశాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం, హైకోర్టు అప్పట్లో మోహనరావుకు విధించిన 2 నెలల జైలు శిక్షను సవరిస్తూ, ఆయనను డిప్యూటీ కలెక్టర్ పదవి నుంచి తహసీల్దార్ హోదాకు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, మోహనరావు తరఫు న్యాయవాదులు, ఆయన జైల్లో 48 గంటల కంటే ఎక్కువ కాలం గడిపితే ఉద్యోగం కోల్పోతారనే ఆందోళనతో, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శిక్షను సవరించాలని కోరారు.
ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు, మోహనరావు తాను చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలని పేర్కొంటూ, కానీ జైలు శిక్షను ఉపసంహరించి, హోదా తగ్గిస్తూ తీర్పు ఇచ్చారు. దీనితోపాటు, పేదల ఇళ్ల నిర్మాణ నిధిగా నాలుగు వారాల్లోగా రూ.1 లక్ష జరిమానా చెల్లించి, ఆ రసీదును కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. ఇకపై పదోన్నతుల విషయంలో ఆయన సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జైలు శిక్ష తప్పించుకునేందుకు మోహనరావు తహసీల్దార్ స్థాయి పదవిని స్వీకరించాలని పూర్వంలో కోర్టు సూచించినప్పటికీ, అప్పట్లో ఆయన అంగీకరించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ గవాయ్, “ఆయన తొలిదశలోనే అంగీకరిస్తే 2–3 ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టే అవకాశముండేది. కానీ నాలుగు వాయిదాల వరకూ కేసు లాగించారు. ఇక నిరాకరించి ఉంటే, ఏ ప్రభుత్వం చేయలేని నిర్ణయం తీసుకునే స్థితిలో మేమున్నాం,” అని వ్యాఖ్యానించారు.

Thiis excellentt website realy has all off tthe information annd facts I wanted abot this sujbject annd
didn’t know whho too ask.