Headlines

రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం-వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ఐ ఎల్ పి ఎ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ పలువురు మేధావులు

 ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ప్రజాస్వామ్య రక్షణ ద్వారానే ప్రజలు రక్షించబడతారని, ప్రజాస్వామ్య రక్షణలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం పచ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 6వ రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయ విలువలు, రాజ్యాంగ హక్కులు, మానవీయ విలువల గూర్చి సామాన్య ప్రజలకు తెలియాల్సిన అవసరముందని, రాజకీయ పార్టీలతో అన్ని పనులు కావని, విలువలు, హక్కుల బోధనలో న్యాయవాదులు ముందుంటే ఆ సమాజంలో స్వేచ, సమానత్వం తొందరగా వస్తుందని అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కతో సహా హై కోర్టు మాజీ న్యాయమూర్తి, సీనియర్ సిటిజన్స్ కమీషన్ కమీషనర్ ఈద తిరుమలదేవి, వరంగల్ జిల్లా జడ్జి వి.బి నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా జడ్జి ఎం.ఆర్ సునీత తో పాటు వివిధ రంగాల మేధావులు హాజరయ్యే ఐ ఎల్ పి ఎ రాష్ట్ర సదస్సును ఈ నెల 14 న హనుమకొండ హంటర్ రోడ్ 'డి' కన్వెన్షన్ లో  నిర్వహించడం గొప్ప విషయమని, ఈ రాష్ట్ర  సదస్సుకు న్యాయవాదులు పెద్ద ఎత్తున్న హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
 కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రాచంద్రం, డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వై. ఎంకయ్య, లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిమ్మ సుదర్శన్, ఆదర్శ లా కళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్, ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి రమేష్ లను సదస్సు ఆహ్వాన పత్రికలను అందించి ఐ ఎల్ పి ఎ ఆర్గనైజింగ్ కమిటీ ఆహ్వానించారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సదస్సు కన్వీనర్ చిల్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా కార్యక్రమాలు చేస్తున్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర సదస్సులో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని బార్ ల నుండి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, రాష్ట్ర కమిటి సభ్యులు జన్ను పద్మ, జిల్లా నాయకులు విలాసాగరం సురేందర్ గౌడ్, పూసపల్లి శ్రీనివాస్, నమ్సానీ చంద్రశేఖర్, జన్ను ఆనంద్ కుమార్, జంగా స్వప్న, గురిమిల్ల రాజు, ఎలమాద్రి రవి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

భారత్ ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చ
ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం