జయహో నినాదం..భీషణ భాంకృతి నినదం..

జయహో నినాదం..
భీషణ భాంకృతి నినదం..!

అదిగదిగో మ్రోగింది యుద్ధభేరి..
దాయాది వెన్నులో
చలి పుట్టిస్తూ..
అఖండ భారతావని
విజయకాంక్షను చాటుతూ..

ఒరేయ్..సాకిస్తాన్ ముష్కరులారా..
శాంతి మా మతమని..
అహింసే మాకు సమ్మతమని..
మైత్రినే కోరుకుంటే..
ధరిత్రి మమ్మల్నే మెచ్చుతుంటే..
సహించలేని మీ నైజం..
దొంగదెబ్బ తీసింది..
మతమడిగి మరీ ప్రాణాలు తీసింది..!

ఉగ్రవాదమే మీ మతమైతే..
దౌర్జన్యమే మీ అభిమతమైతే..
చాలిక..ఇదే ఇదే మా హెచ్చరిక
చెల్లవు మీ కుత్సితాలు..
రుచి చూసారా తొలిదెబ్బ..
మీ నేల కాదా శవాల దిబ్బ..
ఇక ప్రతిరోజు చూడరా..
దెబ్బకు దెబ్బ..
దెబ్బ మీద దెబ్బ..!

ఈ దురాగతాలు..
అవి మీ మనోగతాలు..
ఇక అవన్నీ గతాలు..
రోషం పొంగిన భారతం
విప్పింది పంజా..
కురుక్షేత్రం కాదిది..
అంతకు మించి అంతం చూసే భీకర రణక్షేత్రం..

అన్నదమ్ముల్ని ..బంధువుల్ని
చంపాలా అని వెనకాడే
అర్జనుడు లేడిక్కడ..
బరిలోకి దిగి గురి చూసి
శతృ శిబిరాలను ధ్వంసం చేసే
సవ్యసాచులు ఎందరో..
భారత సైనికుల రూపంలో..
పాకిస్తాన్ పేరును ప్రపంచ పటంలో శాశ్వతంగా చెరిపేసే
పటాలంలో..మీ చరిత్ర
ఇక ఎప్పటికీ పాతాళంలో..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Share this post

2 thoughts on “జయహో నినాదం..భీషణ భాంకృతి నినదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన