కాళేశ్వరం అవి నీతిపై సిబిఐ విచారణ కోరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీ వ్ర వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ కీలకనేత తన మేనబావ హరీష్‌రావు, కజిన్ సంతోష్ రావులను టార్గెట్ చేసారు. ఆఇద్దరు, ముగ్గురు నేతలే కేసీఆర్‌పై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్‌ది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారని.. కానీ, అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
కవిత వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీ ర్గాలలో కలకలం రేపాయి.
మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ “కేసీఆర్ బలిపశువుగా మారుతున్నారు. ఈ కుట్ర వెనక హరీష్‌రావు, సంతోష్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరినీ రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు” అని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా దుప్ర్షచారం నడిపిస్తున్నారని, ఈ కుట్రలన్నీ తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఆమె అన్నారు.
“ నాన్నకు డబ్బు, తిండిపై ఎప్పుడూ ఆశ లేదు. ఆయన పరువు పోవడం మాకు బాధగా ఉంది..నాపెండ్లికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో నాకు తెల్సు. కానీ కాళేశ్వరం అవినీతిలో అసలు బాధ్యత హరీష్‌రావు, సంతోష్‌పైనే ఉంది. అందుకే హరీష్‌ను ఇరిగేషన్ మంత్రిత్వ బాధ్యతల నుంచి తొలగించారు. కేసీఆర్ పేరుతో ఆస్తులు కూడబెట్టింది వారే. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అయ్యారు” అంటూ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌పై సీబీఐ విచారణకు తెర తీసిందని ఆమె ఆరోపించారు. “నా వెనుక ఎవరో ఉన్నారంటారు.. కానీ ఎవరూ లేరు..నేనే భాదతో చెప్తున్నా ఇందులో నిజం చెప్పాలంటే కేసీఆర్ ఒక్కరినే టార్గెట్ చేసి పెద్ద కుట్ర నడుస్తోంది” అని కవిత స్పష్టం చేశారు.