మహానగరంలో ప్రపంచ సుందరీమణుల సందడి

MISS WORLD HYDERABAD

హైదరాబాద్, మే 02, 2025: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ వేదికపై తన బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఉన్నతంగా నిలపడానికి సిద్ధమవుతోంది.

పోటీలకు హాజరవుతున్న ప్రపంచ సుదరీ మణులు మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో సందడి చేయనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మెగా ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్ మరియు సేఫ్టీ టూరిజంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కథనాన్ని ప్రపంచానికి చాటనున్నారు.

తెలంగాణ రైజింగ్: ప్రపంచ దృష్టి హైదరాబాద్‌పై
“ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!” అనే నినాదంతో ఈ ఈవెంట్ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి పోవాలని అందుకుతగిన విదంగా ఏర్సాట్లు చేస్తున్నారు.

రు 120 దేశాల నుంచి పోటీదారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. మే 2 నుంచి 8 వరకు పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రదర్శించేందుకు ప్రత్యేక థీమ్‌లు, పర్యాటక సర్క్యూట్‌లు రూపొందించారు.

పోటీల షెడ్యూల్: సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికత ప్రదర్శన
మిస్ వరల్డ్ 2025 పోటీలలో భాగంగా వివిధ కార్యక్రమాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగనున్నాయి:

  • మే 12: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్ట్‌ను పోటీదారులు సందర్శిస్తారు. బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం రూపొందించారు.
  • మే 12: హైదరాబాద్‌లో చార్మినార్, లాడ్ బజార్‌లలో “హెరిటేజ్ వాక్” నిర్వహిస్తారు, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతూ.
  • మే 13: చౌమల్ల ప్యాలెస్ సందర్శనతో పాటు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ను పోటీదారులు ఆస్వాదిస్తారు.
  • మే 14: వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట సందర్శన (గ్రూప్ 1), యునెస్కో వారసత్వ రామప్ప ఆలయ సందర్శనతో పాటు పేరిణి నృత్య ప్రదర్శన (గ్రూప్ 2).
  • మే 15: యాదగిరిగుట్ట ఆలయ సందర్శన (గ్రూప్ 1), పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీ ప్రదర్శన (గ్రూప్ 2).
  • మే 16: మెడికల్ టూరిజం ఈవెంట్‌లో AIG హాస్పిటల్ సందర్శన (గ్రూప్ 1), మహబూబ్‌నగర్‌లో పిల్లలమర్రి వృక్షం, ఎక్స్పీరియం ఎకో పార్క్ సందర్శన (గ్రూప్ 2).
  • మే 17: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్, రామోజీ ఫిలిం సిటీ సందర్శన.
  • మే 18: తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సందర్శన, సచివాలయంలో రాష్ట్ర గ్రోత్ స్టోరీ పరిచయం, ట్యాంక్ బండ్‌పై సండే ఫండే కార్నివాల్.
  • మే 20-21: కాంటినెంటల్ ఫినాలే, ఐపీఎల్ మ్యాచ్ (గ్రూప్ 1), శిల్పారామంలో ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ వర్క్‌షాప్ (గ్రూప్ 2).
  • మే 22-26: టాలెంట్ ఫినాలే, హెడ్-టు-హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ & ఫ్యాషన్ ఫినాలే, బ్యూటీ విత్ ప్యాషన్.
  • మే 31: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే.

పెట్టుబడుల ఆకర్షణకు సువర్ణావకాశం
మిస్ వరల్డ్ పోటీలను సువర్ణావకాశంగా మలచుకుని, తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక రంగాలకు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునికతను సమన్వయంతో ప్రదర్శించే ఈ ఈవెంట్, రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా మరింత ప్రముఖంగా నిలపనుంది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో