శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పలు ప్రముఖులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,
రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నారు.




ఎంపీ బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్, భూపాల్ పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ మేడారం జాతరను సందర్శించి అమ్మవారు దర్శనం చేసుకున్నారు.



పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం, రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అమ్మ వార్లకు మొక్కలు చెల్లించారు.
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ వుమెన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ కు గద్దల వద్ద జరిగిన నూతన కట్టడాలు అభివృద్ధి గురించి అందులోని విశేషాలు గురించి మంత్రి సీతక్క వివరించారు.

