దసరా వేడుకలో రాజా భయ్యా  ఆయుధాల ప్రదర్శన పై దుమారం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్ జిల్లా కుండా ఎమ్మెల్యే, జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) అధ్యక్షుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా వందలాది ఆయుధలకు ఆయుధ పూజ నిర్వహించి వార్తల్లో కెక్కారు.


దసరా సందర్భంగా ఆయుధాల పూజ కార్యక్రమంలో ఆయన  ప్రదర్శించిన భారీ ఆయుధ సంపదపై పెద్ద ఎత్తున్నే వివాదం చెలరేగింది.
ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా రాజా భయ్యా తన కుండాలోని బెంటీ మహల్‌లో సంప్రదాయ శస్త్ర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టేబుళ్లపై  సుమారు 200కు పైగాదేశీ, విదేశీగా పిస్టల్స్, రివాల్వర్లు, 12 బోర్ గన్స్, రైఫిల్స్, కార్బైన్స్ వంటి ఆయుధాలు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా రాజా భయ్యా మాట్లాడుతూ – “ఈ శస్త్రాలు అన్నీ మా‌వి. మా‌వి అంటే మా అనుచరుల‌వే, వారి‌వి కూడా మా‌వే ” అని అన్నారు.

అయితే, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాజా భయ్యా పేరుపై కేవలం మూడు లైసెన్స్‌డ్ ఆయుధాలే ఉన్నాయని పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి. అదే విధంగా ఆయన భార్య భానవి సింగ్ వద్ద కూడా మూడు లైసెన్స్‌డ్ ఆయుధాలున్నట్లు రికార్డుల్లో ఉన్నాయ్.
అఫిడవిట్ ప్రకారం –


• రాజా భయ్యా వద్ద ₹83 వేల విలువైన రైఫిల్, ₹42 వేల విలువైన గన్, ₹95 వేల విలువైన పిస్టల్ ఉన్నాయి.
• భానవి సింగ్ వద్ద ₹90 వేల పిస్టల్, ₹82 వేల రైఫిల్, ₹38 వేల గన్ ఉన్నట్లు నమోదు చేశారు.
• వీరిద్దరి మధ్య విడాకుల కేసు పెండింగ్లో ఉంది. ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు.
• రాజభయ్య దగ్గర విదేశీ ఆయుధాలున్నాయని బానవి సింగ్ ఓపెన్ గా ఆరోపణలు చేసారు.
అయితే దసరా సందర్భంగా ప్రదర్శించిన భారీ ఆయుధ సంపదలో అనుచరుల ఆయుధాలు కూడా ఉన్నాయని, వాటినే రాజా భయ్యా తమవిగా పేర్కొన్నారని చెబుతున్నారు.

దసరా సందర్భంగా శస్త్ర పూజ చేయడం ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. ఈ పూజలో సామూహికంగా సమాజంలోని అనేక మంది కలిసి ఆయుధాలను పూజించడం సాధారణంగా జరుగుతుంది.

దసరా వేడుకలో ప్రదర్శించిన ఆయుధాలన్నీ రాజా భయ్యా వ్యక్తిగత మైనవి  కావు. వాటిలో ఆయన అనుచరుల ఆయుధాలూ ఉండే అవకాశం ఉన్నాయి.
ఆయన స్వంత ఆయుధాలు కాకుండా అనుచరులతో కల్సి సమూహకంగా ఆయుధ ప్రదర్శన చేసి ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడనేది అర్ధం కాని ప్రశ్న. ఇట్లా సామూహిక ఆయుధ ప్రదర్శన కు చట్టం ఒప్పుకుంటుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు.
వ్యక్తిగత ఆయుధ పూజలు ఎవరి ఇంట్లో వాళ్లు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవు. కాని ఇలా ఒకే చోట నిర్వహించడం ఏ కోశాన చూసిన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.


ఇక రాజా భయ్యా విషయానికి వస్తే ఆయన ఆయన భార్యపూర్వీకులు రాజ వంశాలకు చెందిన వారు. కొట్లాది సంపదకు అధిపతులు.
రాజభయ్య కు స్థానికంగా మంచి పట్టు పలుకుబడి ఉన్నాయ్. 1993 నుండి వరుసగా ఏడు సార్లు శాసన సభకు ఎంపికయ్యారు.
మూడు సార్లు మంత్రి పదవులు నిర్వహించారు.

Share this post

8 thoughts on “దసరా వేడుకలో రాజా భయ్యా  ఆయుధాల ప్రదర్శన పై దుమారం

  1. Sản phẩm casino trực tuyến tại xn88 com nhà cái được xem là sân chơi đẳng cấp, vị trí hàng đầu tại châu Á. Anh em dễ dàng tìm kiếm đa dạng thể loại bài, từ truyền thống cho tới tựa game hiện đại, từ sản phẩm hiếm gặp cho tới phổ biến.

  2. Hiện nay, slot365 link alternatif là nền tảng cá cược trực tuyến được nhiều nhà cung cấp game săn đón khi thu hút hơn 10 triệu lượt đăng ký kể từ khi ra mắt. Hơn 99+ NPH đã và đang cung cấp trò chơi trực tiếp tại trang chủ chính thức của chúng tôi với đa dạng lối chơi mới lạ.

  3. Dưới đây là những sản phẩm mà xn88 app com đã và đang cung cấp tại trang chủ chính thức mà bạn có thể lựa chọn trong mỗi lần truy cập.

  4. Dưới đây là những sản phẩm mà xn88 app com đã và đang cung cấp tại trang chủ chính thức mà bạn có thể lựa chọn trong mỗi lần truy cập.

  5. chơi bài 66b đã xây dựng được niềm tin lớn từ cộng đồng nhờ chú trọng vào yếu tố an toàn và minh bạch trong mọi khâu vận hành. Với quy trình kiểm soát nghiêm ngặt và công nghệ hiện đại, trải nghiệm của người chơi luôn được bảo vệ tối đa ở mọi khía cạnh.

  6. Ngoài ra, hàng ngày nhà cái còn có rất nhiều chương trình khuyến mãi hấp dẫn, bất ngờ. Vì vậy, đừng chần chờ gì nữa, đăng ký đăng nhập 188v tặng 90k ngay hôm nay và để không bỏ lỡ cơ hội nhận được nhiều phần quà giá trị. TONY12-082

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన