ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్ జిల్లా కుండా ఎమ్మెల్యే, జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) అధ్యక్షుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా వందలాది ఆయుధలకు ఆయుధ పూజ నిర్వహించి వార్తల్లో కెక్కారు.
దసరా సందర్భంగా ఆయుధాల పూజ కార్యక్రమంలో ఆయన ప్రదర్శించిన భారీ ఆయుధ సంపదపై పెద్ద ఎత్తున్నే వివాదం చెలరేగింది.
ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా రాజా భయ్యా తన కుండాలోని బెంటీ మహల్‌లో సంప్రదాయ శస్త్ర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టేబుళ్లపై సుమారు 200కు పైగాదేశీ, విదేశీగా పిస్టల్స్, రివాల్వర్లు, 12 బోర్ గన్స్, రైఫిల్స్, కార్బైన్స్ వంటి ఆయుధాలు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రాజా భయ్యా మాట్లాడుతూ – “ఈ శస్త్రాలు అన్నీ మావి. మావి అంటే మా అనుచరులవే, వారివి కూడా మావే ” అని అన్నారు.
అయితే, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాజా భయ్యా పేరుపై కేవలం మూడు లైసెన్స్‌డ్ ఆయుధాలే ఉన్నాయని పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి. అదే విధంగా ఆయన భార్య భానవి సింగ్ వద్ద కూడా మూడు లైసెన్స్‌డ్ ఆయుధాలున్నట్లు రికార్డుల్లో ఉన్నాయ్.
అఫిడవిట్ ప్రకారం –
• రాజా భయ్యా వద్ద ₹83 వేల విలువైన రైఫిల్, ₹42 వేల విలువైన గన్, ₹95 వేల విలువైన పిస్టల్ ఉన్నాయి.
• భానవి సింగ్ వద్ద ₹90 వేల పిస్టల్, ₹82 వేల రైఫిల్, ₹38 వేల గన్ ఉన్నట్లు నమోదు చేశారు.
• వీరిద్దరి మధ్య విడాకుల కేసు పెండింగ్లో ఉంది. ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు.
• రాజభయ్య దగ్గర విదేశీ ఆయుధాలున్నాయని బానవి సింగ్ ఓపెన్ గా ఆరోపణలు చేసారు.
అయితే దసరా సందర్భంగా ప్రదర్శించిన భారీ ఆయుధ సంపదలో అనుచరుల ఆయుధాలు కూడా ఉన్నాయని, వాటినే రాజా భయ్యా తమవిగా పేర్కొన్నారని చెబుతున్నారు.
దసరా సందర్భంగా శస్త్ర పూజ చేయడం ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. ఈ పూజలో సామూహికంగా సమాజంలోని అనేక మంది కలిసి ఆయుధాలను పూజించడం సాధారణంగా జరుగుతుంది.
దసరా వేడుకలో ప్రదర్శించిన ఆయుధాలన్నీ రాజా భయ్యా వ్యక్తిగత మైనవి కావు. వాటిలో ఆయన అనుచరుల ఆయుధాలూ ఉండే అవకాశం ఉన్నాయి.
ఆయన స్వంత ఆయుధాలు కాకుండా అనుచరులతో కల్సి సమూహకంగా ఆయుధ ప్రదర్శన చేసి ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడనేది అర్ధం కాని ప్రశ్న. ఇట్లా సామూహిక ఆయుధ ప్రదర్శన కు చట్టం ఒప్పుకుంటుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు.
వ్యక్తిగత ఆయుధ పూజలు ఎవరి ఇంట్లో వాళ్లు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవు. కాని ఇలా ఒకే చోట నిర్వహించడం ఏ కోశాన చూసిన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
ఇక రాజా భయ్యా విషయానికి వస్తే ఆయన ఆయన భార్యపూర్వీకులు రాజ వంశాలకు చెందిన వారు. కొట్లాది సంపదకు అధిపతులు.
రాజభయ్య కు స్థానికంగా మంచి పట్టు పలుకుబడి ఉన్నాయ్. 1993 నుండి వరుసగా ఏడు సార్లు శాసన సభకు ఎంపికయ్యారు.
మూడు సార్లు మంత్రి పదవులు నిర్వహించారు.