కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ – CSM) విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కక్కర్ల శివకుమార్‌కు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి డాక్టరేట్ (Ph.D.) డిగ్రీ లభించినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. ఆశోక రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
“డయాబెటిక్ రెటినోపతి రోగ నిర్ధారణ కోసం ఫండస్ చిత్రాల విభజన మరియు వర్గీకరణకు డీప్ న్యూరల్ నెట్‌వర్క్‌ల వినియోగం” అనే అంశంపై శివకుమార్ తన పరిశోధనను MVSR ఇంజినీరింగ్ కాలేజీ, హైదరాబాద్ సీఎస్‌ఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. బి. సంద్యా ఆధ్వర్యంలో పూర్తిచేశారు.
డయాబెటిక్ రెటినోపతి (DR) గుర్తింపు కోసం ఆయన అభివృద్ధి చేసిన డీప్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్ పటిష్టమైన విభజన, వర్గీకరణ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ పద్ధతిలో గుండ్రటి మరియు అసమాన గోళాకార హాని లక్షణాలైన ఎక్సుడేట్లు, హెమరేజ్‌ల వంటి అసాధారణ లక్షణాలను విజయవంతంగా గుర్తించగలిగారు.
ఈ పరిశోధన ఫలితాలు ప్రభావవంతమైన చికిత్స నిర్ణయాలను తీసుకునే ప్రక్రియకు సహకరించగలవని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కిట్స్ ఛైర్మన్ మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మికాంత్ రావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే – హుస్నాబాద్ నియోజకవర్గం), అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. ఆశోక రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. పరిశ్రమకు అవసరమైన వాస్తవ సమస్యలపై శోధన జరపడం గర్వకారణమన్నారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సీఎస్‌ఎమ్ హెడ్ ప్రొఫెసర్ సూరా నర్సింహారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేశ్ రెడ్డి, అన్ని విభాగాల డీన్లు, హెడ్‌లు, అధ్యాపకులు, సిబ్బంది మరియు రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ & పీఆర్వో డా. డి. ప్రభాకర చారి శివకుమార్‌ను అభినందించారు.
కిట్స్ వరంగల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్ కు పీహెచ్‌డీ

6kglw9