నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మత్స్యశాఖ అధికారి ఎం. చరిత రెడ్డి లంచం స్వీకరిస్తూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
వివరాల ప్రకారం, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీకి సంభందించి కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతుల కోసం ఫిర్యాదుదారుని నుంచి రూ.20,000 లంచం డిమాండ్ చేసారు. భాదితుడు ఎసిబి అధికారును ఆశ్రయించాడు. లంచం స్వీకరిస్తుమడగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
చరిత రెడ్డి హ్యాండ్‌బ్యాగ్‌లో ఆ డబ్బు స్వీకరించగా ఈ మొత్తాన్ని అక్కడికక్కడే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తన పదవిని దుర్వినియోగం చేసి అవినీతిపరంగా వ్యవహరించినట్టు తేలడంతో, చరిత రెడ్డిని అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లి SPE & ACB ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తుకొనసాగుతోంది.
లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X/Twitter (@TelanganaACB) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు.