మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న గండ్ర వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.
స్టేషన్లో నమోదైన Cr. No. 2202/2025 కేసుకు సంబంధించి నోటీసు కాపీలు అందించడం, అలాగే భవిష్యత్తులో ఈ కేసులో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా సహకరిస్తానని చెప్పి రూ.50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్ గండ్ర వినయ్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గండ్ర వినయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పటి నుండి లంచాలకు పీడించే వాడని ఫిర్యాదులున్నాయి.
ఫిర్యాదుదారుడు ఎస్ఐ వేధింపులు భరించ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


Hello very nice website!! Guy .. Excellent .. Superb .. I will bookmark your blog and take the feeds additionallyKI am happy to seek out so many helpful info right here within the put up, we’d like work out more strategies on this regard, thank you for sharing. . . . . .
Excellent site. Lots of helpful info here. I am sending it to a few buddies ans additionally sharing in delicious. And certainly, thanks on your effort!
lt33vp