సిద్దిపేట జిల్లా ములుగు రక్షకభట నిలయంలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. విజయ్ కుమార్ మరియు కానిస్టేబుల్ (డ్రైవర్) రాజు లను తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేసారు. ఫిర్యాదుదారుడి సోదరికి చెందిన ఒక నివాసయోగ్య ఆస్తికి సంబంధించి ఎవిక్షన్ (ఆస్తి ఖాళీ చేయించడం) ప్రక్రియలో భాగంగా ఆమెను హక్కుదారుగా గుర్తించేందుకు, ఇతర శాఖ అధికారులకు సహకరించేందుకు ₹50,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఫిర్యాదుదారు ఈ విషయాన్ని అధికారులకు ఏసీబీ అధికారులకు తెలియజేయగా, ఏసీబీ అధికారులు వలపన్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇద్దరినీ అరెస్ట్ చేసారు. ఎస్ ఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

