కిట్స్ వరంగల్‌ లో ఏడుగురు విద్యార్థులకు 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు


వరంగల్:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్‌కు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఏడుగురికి గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఎగెన్ (Egen Solutions) లో ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించాయి.


కిట్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. సిఎస్ఈ, సీఎస్ఎన్ వంటి సర్క్యూట్ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఎంపికయ్యారు.
2025–26 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు సివిల్, మెకానికల్, ఈసీఈ, ఐటీ, ఈఈ, ఈసీఐ సహా మొత్తం 10 బ్రాంచ్‌ల నుంచి 324 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.
ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ డీన్ ప్రొఫెసర్ వై. పురందర్ మాట్లాడుతూ ఎగెన్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సేవలు అందిస్తున్న గ్లోబల్ కంపెనీ అని తెలిపారు. అమెరికా, కెనడా, యూరప్, ఇండియాలో కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా సిఎస్ఈ హెచ్‌ఓడీ డా. పి. నిరంజన్, సీఎస్ఎన్ హెచ్‌ఓడీ డా. వి. శంకర్, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఈ. కిరణ్ కుమార్, టీపీఓ డా. టి. చంద్రబాయి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్లు తదితరులు విద్యార్థులను అభినందించారు.

Share this post

2 thoughts on “కిట్స్ వరంగల్‌ లో ఏడుగురు విద్యార్థులకు 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

  1. You could definitely see your expertise in the paintings you write. The sector hopes for more passionate writers such as you who aren’t afraid to say how they believe. All the time follow your heart.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన