వరంగల్, ఆగస్టు 18:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కెఐటీఎస్) వరంగల్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్‌వర్క్స్) విభాగం ఆధ్వర్యంలో “AI-Driven Cybersecurity: Defense Strategies for the Digital Era” అనే అంశంపై ఏఐసీటీఈ-అటల్ వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం ఆగస్టు 18 నుండి 23 వరకు జరుగనుంది.
సోమవారం జరిగిన ఆరంభోత్సవంలో కెఐటీఎస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోకరెడ్డి ఎఫ్‌డీపీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు డీన్ ఆర్&డి డాక్టర్ ఎం. వీరారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోకరెడ్డి మాట్లాడుతూ, బోధనా విధానాల్లో నూతనత అవసరాన్ని హైలైట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో సైబర్ దాడులను ముందస్తుగా అరికట్టడం, AI/ML సాధనాలను ఉపయోగించి ముప్పులను గుర్తించడం, నివారించడం, ప్రతిస్పందించడం వంటి అంశాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ముఖ్యమని ఆయన వివరించారు.
ఈ ఎఫ్‌డీపీ ద్వారా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను వినియోగించి, ఇన్‌ట్రూజన్ మరియు మాల్వేర్ డిటెక్షన్ మోడళ్ల రూపకల్పన, పరిశోధనలో వినియోగించేలా ఫ్యాకల్టీకి మార్గదర్శకత్వం లభించనుంది.
సిఎస్‌ఎన్ విభాగాధిపతి డాక్టర్ వి. శంకర్ మాట్లాడుతూ, ఈ ప్రోగ్రామ్ విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, ప్రోగ్రామింగ్ సవాళ్లలో మెరుగ్గా రాణించేందుకు ఉపకరిస్తుందని తెలిపారు.
కార్యక్రమాన్ని డాక్టర్ ఎస్. వెంకట్రాములు (అసోసియేట్ ప్రొఫెసర్, CSN), డి. రమేష్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, CSN) సమన్వయం చేశారు. విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, డాక్టర్ వి. చంద్ర శేఖర్ రావు, డాక్టర్ డి. ప్రభాకర చారి తదితరులు పాల్గొన్నారు.
KITS చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్ పి. నారాయణరెడ్డి, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ విభాగాధ్యక్షులు, అధ్యాపకులను అభినందించారు.