వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బ్యాంకు మేనేజర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట కో – ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు దిశా నిర్దేశం చేసారు.
బ్యాంకు టర్నోవర్ 2500 కోట్లకు చేరుకునేలా అందరూ కృషిచేయాలని మొండి బకాయిలపై పూర్తి శ్రద్ద ఉంచాలని అన్నారు.
నిర్దేశించిన టార్గెట్స్ అన్నింటిని గడువు లోగా సాధించాలని, ప్రతి నెల వారీగా వ్యక్తిగత పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవ్వని యెడల తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించినారు.
సంఘాల ద్వారా ఇచ్చి ఉన్న రుణాలను కూడా లీగల్ గా కవర్ చేసి రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని సూచించారు.
IRAC నామ్స్ కి లోబడి 31.03.2025 సంవత్సరానికి గాను నిరర్ధక ఋణాలుగా వర్గీకరించబడిన మొండీ బకాయిలను రికవరీ చేయాలనీ మేనేజర్లను ఆదేశించారు.
ప్రతి నెల ఖాతాధారులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి సలహాలను తీసుకుంటూ మంచి సర్వీసులు అందించాలని సూచించారు
Joint liability groups and petty trader loans laku ఇచ్చిన OTS స్కీమ్ ను అందరు బాకీదారులకు తెలియచేసి సాధ్యమైనంథ వరకు రికవరీ చేయాలని ఆదేశించినారు
ఈ ఆర్ధిక సంవత్సరం మన బ్యాంకు ని రాష్ట్ర స్థాయిలో రెండవ పోసిషన్ కి తీసుకురావాలని ఆదేశించారు.
తదుపరి జరగబోయే నాబార్డ్ వారి inspection నందు కూడా మన బ్యాంక్ A category పొందడానికి అందరూ ఆర్బీఐ మరియు నాబార్డ్ వారి ఆదేశాలను పటిస్తూ బ్యాంక్ అబివృద్దికి కృషి చేయాలని అన్నారు..
అనంతరం డిసిసిబి బ్యాంకు ఉద్యోగస్తుల వేతన సవరణ చేసిన సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా డిసిసిబి బ్యాంకు ఉద్యోగస్తులు చైర్మన్ రవీందర్ రావు గారికి శాలువ కప్పి సన్మానించి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్,జిఏం పద్మావతి,డీజీఎం అశోక్,ఏజిఎంలు మధు,గొట్టం స్రవంతి, బోడ రాజు,గంప శ్రవంతి,కృష్ణ మోహన్,డిఆర్ ఓఎస్డీ విజయ కుమారి,వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు