వరంగల్ ఎంపీ కృషికి ఫలితం
సీజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ లో ఉద్యోగుల నియమిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్
పలుమార్లు కేంద్రమంత్రిని కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ
ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
వరంగల్ సీజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని కోసం చాలా కాలంగా కృషి చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రయత్నాలు ఫలించాయి. వరంగల్‌లో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు, అందులో సిబ్బంది ఏర్పాటు కోసం ఎంపీ డా.కడియం కావ్య నిరంతరం కేంద్ర మంత్రులను కలసి పట్టుదలతో సాధించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… వరంగల్ సీజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుందని అన్నారు. వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు, అందులో సిబ్బంది వెంటనే నియమించాలని కేంద్రమంత్రిని కలసి కోరినట్లు ఎంపీ తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్ నెస్ సెంటర్‌లో సిబ్బంది నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది . ప్రతి వెల్ నెస్ సెంటర్ లో 13 మంది ఉద్యోగులు ఉంటారని, వీరిలో డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, అటెండెంట్లు, ఇతర సిబ్బంది ఉంటారని తెలియజేసారు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు చికిత్స కోసం హైదరాబాద్‌కి వెళ్ళాల్సి వచ్చేదని, ఇప్పుడు వరంగల్‌లోనే వైద్య సదుపాయం అందుబాటులోకి రానుందని ఎంపీ స్పష్టం చేసారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది మరింత ఉపయోగపడుతుందని తెలిపారు.
వరంగల్ తో పాటు దేశవ్యాప్తంగా కొత్తగా 22 సీజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 286 పోస్టులు గాను మొదటి దశలో 88 పోస్టులకు మంజూరు ఇవ్వడం జరిగింది.