బీబీసీ తో విశ్వసనీయ సమాచారం – ఆచార్య వల్లూరి రాంచంద్రం, కేయూ రిజిస్ట్రార్

‘బీబీసీ’తో విశ్వసనీయ సమాచారం – ఆచార్య వల్లూరి రాంచంద్రం, కేయూ రిజిస్ట్రార్

నేడు పోటీ ప్రపంచంలో కూడా బీబీసీ న్యూస్ ఛానల్ విశ్వసనీయతకు డోకా లేదని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాంచంద్రం నారు. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ, దూరవిద్య న్యూ సెమినార్ హాల్ లో బుధవారం బిబిసి కలెక్టివ్ న్యూస్ రూమ్ అండ్ బిబిసి తెలుగు ఛానల్ ఆధ్వర్యంలో జర్నలిజం విద్యార్థులకు ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రామచంద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని వార్తలు సేకరించడంలో బిబిసి న్యూస్ ఇండియా ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతి పొందిందని, రాష్ట్రంలో బిబిసి తెలుగు న్యూస్ విస్తరణతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెల్పినారు.

ఈ సందర్భంగా ట్రైనింగ్ అండ్ కల్చర్, బీబీసీ న్యూస్ ఇండియా విభాగాధిపతి, ఇక్బాల్ అహ్మద్ కీలకోపాన్యాసం చేస్తూ బీబీసీ ఛానల్ ద్వారానే
విశ్వసనీయ సమాచారం ప్రజలకు చేరవేస్తున్నారని, బి బి సి ఛానల్ ప్రజలు ఆకర్షించే కథనాల్లో
,కచ్చితత్వం,విశ్వసనీయత,ఉండటం వల్లనే బీబీసీ ప్రపంచంలో ప్రజల మన్నలను పొందుతున్నదని తెలిపారు. 2017లో బీబీసీ రెండు డిజిటల్ భాషల్లో ఉండేది. అందులో ఒకటి హిందీ మరొకటి తమిళ భాషల్లో వెలువడేది. అటువంటిది 2017 తర్వాత బీబీసీలో ఆరు భాషల్లోకి విస్తరించిందని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కూడా బి బి సి తెలుగు ఛానల్ ను ప్రవేశపెడుతున్నామని, బిబిసి లో ఒక కథనం పబ్లిష్ అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. అందువల్ల బిబిసి ఛానల్ లో పనిచేయాలని ఉద్దేశంతో విద్యార్థులు ముందుకు వస్తే ఉద్యోగంతో పాటు, మంచి వేతనం లభిస్తుందని అన్నారు. సమావేశానికి దూరవిద్య కేంద్రం డైరెక్టర్, జర్నలిజం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య సురేష్ లాల్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఏఐ, చాట్ జిపిటి లాంటి అత్యాదునిక టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు విషయ పరిజ్ఞానం దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ మాట్లాడుతూ బీబీసీ ఔట్ రీచ్ ట్రైనింగ్ స్కీం ద్వారా విద్యార్థులు ఎన్నో మెలకువలు తెలుసుకుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేయూ,ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె బిక్షాలు, బీబీసీ ఛానల్ అసిస్టెంట్ ఎడిటర్, అనిల్, అధ్యాపకులు కంజర్ల నరసింహా రాములు, డాక్టర్ శ్రీకాంత్,డా. సుధాకర్, పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు,ఈర్ల సురేందర్,ప్రనూప్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE