గోదావరిలో ఉధృతి – రామన్నగూడెం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
మంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుధవారం తెలిపారు.
ఉదయం 11 గంటలకు రామన్నగూడెంలో గోదావరి నీటిమట్టం 15.83 మీటర్లకు చేరుకోవడంతో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
గోదావరి పరివాహక గ్రామాల ప్రజలకు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ముప్పు తలెత్తిన వెంటనే అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, గోవిందరావుపేట, ఏటూరునాగారం మండలాల్లోని 75 కుటుంబాలను తరలించి 8 పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.
అదనంగా, ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, జిల్లా పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలతో సమన్వయంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రజలకు జారీ చేసిన సూచనలు
- నది తీర ప్రాంతాలకు వెళ్లరాదు
- వరద నీటిలో వాహన ప్రయాణాలు చేయరాదు
- పిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంచాలి
- అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి
- అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించుకోవాలి
ఇబ్బందులు ఎదుర.