Site icon MANATELANGANAA

రామన్న గూడెం వద్ద పెరిగిన గోదావరి మట్టం రెండవ ప్రమాదక హెచ్చరిక జారీ

గోదావరిలో ఉధృతి – రామన్నగూడెం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

మంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుధవారం తెలిపారు.

ఉదయం 11 గంటలకు రామన్నగూడెంలో గోదావరి నీటిమట్టం 15.83 మీటర్లకు చేరుకోవడంతో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

గోదావరి పరివాహక గ్రామాల ప్రజలకు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ముప్పు తలెత్తిన వెంటనే అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, గోవిందరావుపేట, ఏటూరునాగారం మండలాల్లోని 75 కుటుంబాలను తరలించి 8 పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.

అదనంగా, ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, జిల్లా పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలతో సమన్వయంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజలకు జారీ చేసిన సూచనలు

ఇబ్బందులు ఎదుర.

Share this post
Exit mobile version