ఆమె నటనా నాట్యమే!
ఎల్ విజయలక్ష్మి @83
*_జలకాలాటలలో_*
*_కిలకిల పాటలలో_*
*_ఏమి హాయిలే హలా.._*
విజయలక్ష్మి
నాగినిలా నర్తిస్తే
పామే కదిలినట్టుంటుంది
జరాజరా..!
*_ఒసే..ఒలే..ఏమిటే.._*
ఇంద్రకుమారి..నాగకుమారి
ఇద్దరిదీ ఆ మాటే..
నాకు మగవాసన కొడుతోందంటూ
పాము జడను చూపిన
జగదేకవీరుడి ఇల్లాలు..
త్రిశోక రాజుకు..
ప్రగ్గడ మంత్రికి
చూపించింది చుక్కలు!
*రాముడు..భీముడు* లో
భీమునితో జత కట్టి..
_దేశమ్ము మారిందోయ్.._
_కాలమ్ము మారిందోయ్_
అంటూ ప్రాజెక్టునే కట్టిన
విజయలక్ష్మి గజ్జె కడితే
తళుకు తళుకు!
ఉత్తరగా మురిసి..
గుండమ్మ కోడలిగా మెరిసి..
పరమానందయ్య శిష్యుల కథలో రంజనిగా ఊపేసిన
*_వెండితెర నాగిని…_*
సినిమాలకి సడెన్ గా
గుడ్ బై చెప్పి..
దత్తాతో వివాహం..
అమెరికా పయనం..
ఆపై వ్యవసాయంలో
ఉన్నత చదువు..
వర్జీనియాలో కొలువు..
ఎక్కడున్నా ఆమెకు
తృప్తినిచ్చేది డాన్స్..
ఆ కళ మెచ్చే
ఆమెకు వేల కొద్దీ ఫ్యాన్స్!
_______________________
*అభినేత్రి..నాట్యమయూరి*
*ఎల్.విజయలక్ష్మికి*
*జన్మదిన శుభాకాంక్షలతో..*
_05.05.1943_
_______________________
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
_9948546286_