బహుజన సమాజ సంఘ పరివర్తన, సామాజికన్యాయం, బహుజన రాజ్యాధికారం పోరాటం చేస్తున్న బాంసెఫ్, రాష్ట్రీయ మూలనివాసి సంఘ్ ల 42వ జాతీయ మహాసభలకు బహుజన సమాజం పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బాంసెఫ్ జాతీయ ప్రచారకులు పిలుపునిచ్చారు. ఒడిస్సా రాష్ట్రం కటక్ నగరం, బారబతి స్టేడియం వద్ద ఈ నెల 26, 27 రెండు రోజుల పాటు జరుగు 42వ జాతీయ మహాసభల కరపత్రాలను మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో ఆవిష్కరించి మాట్లాడారు. వెనుకబడిన తరగతుల కులాల జనగణనతో పాటు దేశంలో మెజార్టీ సమాజమైన బహుజన సమాజం ఎదుర్కుంటున్న పలు సమస్యలపై జాతీయ మహాసభలో చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. ఒక్కటిగా కలిసి నడిచే బహుజన సమాజాన్ని చీల్చే కుట్రలపై, జనాభా దామాషాపై రిజర్వేషన్లు కల్పించడం, సంచార జాతులను గుర్తించాలని, ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేసి బహుజన వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టడం లాంటి పలు సామాజిక అంశాలపై చర్చించి బహుజన సమాజాన్ని స్వతంత్ర రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే బాంసెఫ్ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
భారతీయ విద్యార్థి మోర్చా జాతీయ నాయకుడు బట్టు శ్రీదర్
ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల భాస్కర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు అవిలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లయ్య, జిల్లా నాయకులు రవీందర్, బిఎంఎం నాయకులు మణితేజ, న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..


Lovely just what I was searching for.Thanks to the author for taking his time on this one.