ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన శివ కుమార్, వి. నర్సయ్య, వి. చంద్రమౌళి, ఆర్. ఎస్. శర్మ, సాంబయ్యలు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుష్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలియజేసారు అనంతరం సీపీ మాట్లాడుతూ
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన ఎస్ఐలకు సూచించారు.