బతికే ఉన్నాం…ఇంకా చావలే

pension

ఎన్నడో… జీవించి ఉన్నట్టు ధృవీకరించాం…!!!*
*
అయినా… రికార్డుల్లో చంపేసి…
పెన్షన్ లకు బ్రేక్..!!!!* .

వృద్ధులనే కనికరం లేని అధికారులు….

*ప్రభుత్వ పెన్షనర్లకు తాజా షాక్…

హన్మకొండ జిల్లా, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో గందరగోళం..
వృద్ధులు…పండుటాకుల అరణ్య రోదనలు చెవికి ఎక్కేనా…!?!? …

మేం….
బతికే ఉన్నాం…!

ఇంకా…
చావలే….!!

ఇదే విషయాన్ని…
జీవించి ఉన్నట్టు…ఆధారాలతో సహా…ఆరు మాసాల ముందే… ధృవీకరించాం…!!!

అయినా… కనికరం లేకుండా …
మమ్మల్ని రికార్డుల్లో చంపివేశారు… !!!!

అంతే కాదు..
వృద్ధులు…పండుటాకులు.. అనే కనికరం లేకుండా..సర్కార్ పెన్షన్లకు బ్రేక్ వేశారు…!!!!!

సాక్షాత్తు… హన్మకొండ జిల్లా, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోనే…
తాజాగా సోమవారం ప్రభుత్వ అధికారిక పెన్షనర్ల అరణ్య రోదనలు హృదయ విదారకంగా మారడం విశేషం.

సమయం… ఉదయం 11గంటలు
స్థలం… హన్మకొండ కలెక్టరేట్ కాంప్లెక్స్
జిల్లా…సబ్ ట్రెజరీ కార్యాలయాలు పని చేసే..
ఫస్ట్ ఫ్లోర్ లో… ఎవరిని కదలించినా.. కన్నీటి గాథలే…!

దశాబ్దాల తరబడి సర్కార్ నౌకరు చేసి..వయసు మీరడంతో పదవీ విరమణ చేసిన తమకు ఇలాంటి కష్టాలేమిటీ..అన్న ఆందోళన ప్రతీ ఒక్కరిలో అక్కడ కనిపించింది..
ఒక్కసారిగా..
మే నెల ఒకటవ తేదీన తమకు రావలసిన పెన్షన్లు నిలిచిపోవడం ..ఆ పండుటాకులను వణికించింది.. ప్రతినెలా ఠంచనుగా వచ్చే పెన్షన్లు ఎందుకు రాలేదో…తెలువక ఆయా వృద్ధ పదవీ విరమణ పెద్దలు తల్లడిల్లిపోయారు.. ఇదేమిటని.. గత పది రోజులుగా… ఇటు మీసేవ… అటు బ్యాంకు శాఖల చుట్టూ ఎండల్లోనే తిరిగారు…
సమాధానం..దొరకలే… సరికదా… బ్యాంకులో బ్యాలెన్స్ లేదన్న చిత్కారాలను చవి చూశారు..
బతికే ఉన్నామని ధృవీకరించిన మీ సేవా కేంద్రాలు… ప్రతీ నెలా పెన్షన్లు చెల్లించే వాణిజ్య బ్యాంకులను సందర్శించి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.

తాజా బాగోతం ఇదే…!
ఇక చేసేదేం లేక సోమవారం ఉదయం నుంచే హన్మకొండ జిల్లా,సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోనే తెలుసుకోవాలని పండుటాకులు క్యూలు కట్టారు..
శని..ఆది వారాలు సెలవు కావడం తో…సోమవారం కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని ఫస్ట్ ఫ్లోర్ ట్రెజరీ అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు బారులు తీరారు .. నవంబర్ నెలాఖరులోగా..జీవించి ఉన్నట్టు ధృవీకరించిన అధికారిక ధృవీకరణ పత్రాలతో ట్రెజరీ అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.. మళ్ళీ బతికి ఉన్నట్లు ధృవీకరించి పత్రాలు సమర్పించమంటూ అధికార్లు హుకుం జారీ చేశారు.

అదికూడా…
ఈ రెండు, మూడు రోజుల్లో సమర్పిస్తే… నెలాఖరు వరకు వారి పెన్షన్లు విడుదల చేసేలా చూస్తామన్న ఉచిత సలహా ఇవ్వడం పండుటాకులను కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేలా చేసింది. తప్పు చేసిన వారు తప్పించుకున్నా … వాళ్ళపై ఎలాంటి చర్యలు లేకపోగా..మళ్ళీ బతికి ఉన్నట్టు “లైఫ్ సర్టిఫికెట్ ‘ మీ సేవా కేంద్రాలు…బ్యాంకుల ద్వారా ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించాల్సి రావడం ప్రభుత్వ లోపభూయిష్ట సిస్టమ్ ను మరింత స్పష్టం చేస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…

Share this post

One thought on “బతికే ఉన్నాం…ఇంకా చావలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి