ఎసిబి రైడ్స్ లో పట్టుబడిన ములుగు జిల్లా ప్రజా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కార్యాలయం లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ – జి. సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ – ఎస్. సౌమ్య
వైద్య సెలవులకు సంబంధించిన జీతం బిల్లులను సిద్ధం చేయడానికి వాటిని ములుగు జిల్లా ఖజానా కార్యాలయానికి పంపించడానికి లంచం తీసుకుంటూ ములుగు జిల్లా ప్రజా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కార్యాలయం లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ – జి. సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ – ఎస్. సౌమ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
మెడికల్ లీవ్స్ కు సంభందించిన బిల్లులు సిద్దం చేసి ట్రెజరీకి పంపేందుకు సూపరింటిండెంట్ సుధాకర్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్య 25 వేల లంచం డిమాండ్ చేసారు.దాంతో ఫిర్యాదు దారుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం లంచం డబ్బులు తీసుకుటుండగా అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ములుగు జిల్లా ప్రజా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కార్యాలయం లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ – జి. సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ – ఎస్. సౌమ్య ములుగు జిల్లా ఖజానా కార్యాలయానికి సమర్పించడానికి” అధికారిక అనుకూలతను చూపించేందుకు అతని నుండి రూ.25,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ పట్టుబడ్డారని ఎసిబి అధికారులు ఒకప్రకటనలో తెలిపారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB ) వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చని తెలిపారు.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.


**mitolyn**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.