జనగామ జనవరి 13 : వి సర్వ్ నినాదం తో మెల్విన్ జోన్స్ మహనీయుడు 1917 లో స్థాపించిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించి అవసరార్థులకు సేవ చేస్తున్న గొప్ప సంస్థ అని లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశురాములు అన్నారు. మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏకశిల పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మెల్విన్ జోన్స్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

జనగామ పట్టణం లోని లయన్స్ క్లబ్ ల పక్షాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ కన్నా మాట్లాడుతూ 1879 లో జన్మించిన మెల్విన్ జోన్స్ 1917 లో స్థాపించిన లయన్స్ క్లబ్ పురోభివృద్ధికి తాను దివంగతుడైన 1961 వరకు మానవ సేవ పరమావధిగా జీవించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంధత్వ నివారణ ప్రధాన లక్ష్యంగా శత వసంతాలు పని చేసిన లయన్స్ సంస్థ రెండవ శతాబ్దంలో “వేర్ దేర్ ఈస్ నీడ్ దేర్ ఈస్ ఏ లయన్” లక్ష్యం తో ఎనిమిది సామాజిక అవసరాలను గుర్తించి విశ్వ వ్యాప్తంగా క్లబ్ ల ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎక్కువ మంది అవసరార్థులకు సేవ చేయడానికి లయన్స్ క్లబ్ లలో సంఖ్య పెంచాలని అందుకు సేవాభిలాషులందరూ లయన్స్ క్లబ్ లో చేరాలని వారు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న జనగాంలోని లయన్స్ క్లబ్ ల నాయకులు మెల్విన్ జోన్స్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ రామీని శ్రీనివాసులు, జిల్లా చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ చంద్రగిరి ప్రసాద్, లియో జిల్లా చైర్మన్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, జోన్ చైర్మన్ కుతాటి ఉప్పలయ్య, జిల్లా నాయకులు నాగబండి రవీందర్, చందుపట్ల రవీందర్ రెడ్డి, రవి నాయక్, క్లబ్ ల అధ్యక్షులు బండ దయాకర్ రెడ్డి, భోగ రామ్ దయాకర్, జి. శివరామ కృష్ణ, పరుష సిద్దయ్య, వై. లక్ష్మీనారాయణ, డా. పి. సత్యం తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా మార్కెటింగ్ చైర్మన్ లయన్ క్రిష్ణ జీవన్ బజాజ్ స్వాగతం పలికారు, చివరన హోస్ట్ క్లబ్ జనగామ ఆబాద్ అధ్యక్షుడు లయన్ కారంపూడి సతీశ్ వందన సమర్పణ చేశారు.

