Headlines

సమ్మక్క–సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి



రూ.250 కోట్లతో ఏర్పాట్లు – సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ
హైదరాబాద్, జనవరి 13 :
ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి గత జాతర కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.


డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీజీలు, వివిధ శాఖల కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా ఎస్పీ రామనాథ్ కేకన్, ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 జాతరకు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులతో విస్తృత ఏర్పాట్లు చేస్తుండటంతో దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


సమ్మక్క–సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించి రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.


తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.


జాతరకు వచ్చే భక్తులకు మార్గదర్శక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక రూట్ మ్యాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కింగ్ విషయంలో వీఐపీ – సాధారణ భక్తుల మధ్య ఎలాంటి తేడా లేకుండా సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.


మంత్రి సీతక్క మాట్లాడుతూ, జాతర ఏర్పాట్లకు రూ.150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణకు రూ.101 కోట్లు కలిపి మొత్తం రూ.251 కోట్లు సీఎం మంజూరు చేశారని తెలిపారు.


శానిటేషన్, తాగునీరు, టాయిలెట్లు, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.


రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడుతూ, జాతర ఏర్పాట్లను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు వినియోగించాలని, జాతర సమాచారానికి ప్రత్యేక యాప్, క్యూ.ఆర్ కోడ్ రూపొందించాలని సూచించారు.


ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏర్పాట్ల పురోగతిని వివరించారు. ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం