60మందితో కల్సి
లొంగి పోయిన మావోయిస్టు
సీనియర్ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన సీనియర్ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు60మంది మావోయిస్టు కార్యకర్తలతో కలిసి అధికారుల ఎదుట లొంగిపోయారు. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఇది ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.
గత రెండేళ్లుగా కేంద్రం మావోయిస్టు లపై పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించింది. మావోయిస్టుల శిబిరాల్లోకి కేంద్రం సాయుధ బలగాలు చొచ్చుకు వెళ్లి దాడులు చేసి అనేక మంది టాప్ లీడర్ల ను హత మార్చారు. వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల బేస్ క్యాంపులు చిన్నభిన్నమయ్యాయి.
ఆపరేషన్ కగార్ పేరిట సాగిన ఫైనల్ ఆపరేషన్ లో కేంద్రం సక్సెస్ అయింది.
కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ఉందని హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దేశ ఆంతరిక భద్రతకు పెద్ద ముప్పుగా నిలిచిందని పూర్తిగా నిర్మూలిస్తామని మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ఛత్తిస్ ఘడ్ లోని దట్ట మైన అటవీ ప్రాంతాలలో కొంబింగ్ ఆపరేషన్ జరిపారు.
2010 నుండి 200కి పైగా జిల్లాల్లో అనేక హింసాత్మక ఘటనలు జరిగి సాయుధ బాలగాలతో పాటు సామాన్యులు మావోయిస్టులు అనేక మంది చనిపోయారు. ఒకప్పుడు మావోయిస్టులు పై చేయి సాధించగా ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2010తో పోల్చితే 2024లో నక్సలైట్ల హింస 81 శాతం, మరణాలు 85 శాతం తగ్గినట్లు వెల్లడించింది.
మావోయిస్టులు కాల్పుల విరమణకు సం సిద్ధత వ్యక్తం చేసి చర్చలకు ప్రత్తిపాదించారు. అయితే మావోయిస్టుల ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వందంగా తిరస్కరించి ఏరివేత కార్యక్రమం కొనసాగించింది.
ఈ పరిస్థితుల్లో మావోయిస్టుల్లో ఉన్న అగ్రనేతల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మల్లొజుల వేణుగోపాల్ సాయుధ విరమణ చేసి లొంగిపోయి జన జీవనంలో కలవాలని చేసిన ప్రకటనతో పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వేణుగోపాల్ ను పార్టీ పక్కకు పెట్టినట్లే భావించవచ్చు. దాంతో వేణుగోపాల్ తన వెంట వచ్చిన వారితో కల్సి లొంగి పోయారని చెబుతున్నారు.


I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
xn88 casino tung chương trình khuyến mãi 100% giá trị thẻ nạp đầu tiên cho thành viên mới. Đừng bỏ lỡ cơ hội nhân đôi số vốn cá cược của bạn. TONY01-06S