హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ
సామాజికన్యాయం, న్యాయవాద హక్కులు, రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పి ఎ) 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడం కోసం హనుమకొండ జిల్లా న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షలు పులి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ నెల 20 న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగు ఐ ఎల్ పి ఎ 5వ రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను మంగళవారం హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో విడుదల చేసి వారు మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ చట్టాలున్నాయని ప్రజల హక్కుల కోసం నిరంతరం వాదించే న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం శోచనీయమని, 80 ఏండ్ల స్వాతంత్ర భారత దేశంలో ఇంకా అసమానతల సమాజం కొనసాగడం శోచనీయమని ఆయన అన్నారు. సమాజంలో అత్యున్నత విద్యతో పాటు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన ఉన్నత విద్యావంతులైన న్యాయవాదులు చైతన్యం చెందడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. మహిళా సమానత్వం, ఆయా వర్గాలకు సమ న్యాయం జరగాలని న్యాయవాదులతో పాటు ప్రజలను చైతన్యం చేస్తున్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో పని చేస్తున్న ఐ ఎల్ పి ఎ మెజార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, సామాజిక న్యాయం కోసం కోర్టుల్లో వాదించే న్యాయ శాఖలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల న్యాయశాఖలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి అణగారిన వర్గాలకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు. న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం కల్పించడం ద్వారనే బహుజన సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని అన్నారు. సామాజిక న్యాయం కోసం ఐ ఎల్ పి ఎ చేస్తున్న పోరాటంలో న్యాయవాదులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 న కొత్తగూడెంలో జరుగు రాష్ట్ర సదస్సులో రాజ్యాంగ విలువలు - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్ట్ ప్రజల హక్కులు, ఇ డబ్ల్యు ఎస్ కు లేని నిబంధన ఓబీసీ లకు ఎందుకు, మహిళా కోటాలో బహుజన కోటా, న్యాయవాద రక్షణ చట్టం అనే నాలుగు అంశాలపై జరుగు సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ హై కోర్టు జడ్జి, మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, విశిష్ట అతిథులుగా కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్, అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి టి చిరంజీవులు, కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షులు సుజాత కె చౌదంటే, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,కర్ణాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, సుభాస్ చంద్ర బోస్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు లు హారవుతారని తెలిపారు. ఇట్టి సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు చిల్ల రాజేంద్రప్రసాద్, మల్లెల భాస్కర్, హనుమకొండ జిల్లా కన్వీనర్ ముచ్చు రాజేందర్, హనుమకొండ బార్ కన్వీనర్ పూసపెల్లి శ్రీనివాస్, న్యాయవాదులు సిరబోయిన శ్రీనివాస్, చింత సాంబశివరావు, సూరం నరసింహ, అంబేద్కర్, కవిత, చింత నిఖిల్, శివకుమార్ యాదవ్, ఎగ్గడి సుందర్ రామ్, రమేష్, పూస రవీందర్, రామకృష్ణ, గంధం శివ, అనిల్, రాచకొండ ప్రవీణ్ కుమార్, అక్రమ్, కొంగర సారయ్య, తదితరులు పాల్గొన్నారు.


Hello, you used to write excellent, but the last few posts have been kinda boring… I miss your tremendous writings. Past several posts are just a little out of track! come on!