KITS వరంగల్‌లో ఫోటోగ్రఫీ నైపుణ్యాలపై -“ఫోటోఎగ్జిబిషన్-2K25” సాంకేతిక సదస్సు.


వరంగల్, డిసెంబర్ 11:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW)లోని స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ (SAC) ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ & మీడియా క్లబ్ (PMC) ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ స్కిల్స్ పై సాంకేతిక సదస్సు మరియు ఫోటోఎగ్జిబిషన్-2K25 కార్యక్రమాలు నిర్వహించారు

ఈ కార్యక్రమం SEA మరియు SAA కార్యకలాపాల లో భాగంగా నిర్వహించారు.
క్యాంపస్‌లోని సివిల్ సెమినార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఒరుగళ్ల వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు ఇంద్రం ముఖ్య అతిథిగా హాజరై బీటెక్ విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.


ఫోటోగ్రఫీ అనేది కేవలం క్లిక్ చేసే కళ మాత్రమే కాకుండా కాంతిని సాంకేతికంగా రికార్డ్ చేసి, నిలకడైన చిత్రాలను సృష్టించే శాస్త్రం అని ఆయన అన్నారు. వైల్డ్‌లైఫ్, నేచర్, కన్జర్వేషన్, పోర్ట్రయిట్ వంటి పలు రకాల ఫోటోగ్రఫీ శైలులు, అలాగే రూల్ ఆఫ్ థర్డ్స్, సిమెట్రీ, బ్రైట్‌నెస్, ప్యాటర్న్ వంటి మూలకాలు విజువల్ ఇంపాక్ట్ పెంచుతాయని వివరించారు.
కెమెరా అనే “మూడో కన్ను” ద్వారా అద్భుతాలను సృష్టించవచ్చని, భావోద్వేగాలను బలంగా చూపించే కథనాలను నిర్మించవచ్చని విద్యార్థులను ప్రేరేపించారు.
ప్రిన్సిపాల్ ప్రొ. కె. అశోక రెడ్డి అధ్యక్ష ప్రసంగంలో విద్యార్థుల ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ, లక్ష్యాల సాధనలో సానుకూల దృక్పథం, కమ్యూనికేషన్ నైపుణ్యాల అవసరంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి డీన్ అకడమిక్ వ్యవహారాలు ప్రొ. వెణుమాధవ్, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డా. హెచ్. రమేశ్ బాబు, SEA–SAA కోఆర్డినేటర్ డా. పి. నాగార్జున రెడ్డి, PMC ఇన్‌చార్జ్ & PRO డా. ప్రభాకరచారి, అలాగే PMC స్టూడెంట్ ప్రతినిధులు, యాంకర్లు వైష్లా, సహస్ర మరియు సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Share this post

One thought on “KITS వరంగల్‌లో ఫోటోగ్రఫీ నైపుణ్యాలపై -“ఫోటోఎగ్జిబిషన్-2K25” సాంకేతిక సదస్సు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన