Headlines

రాజకీయ పార్టి ఏర్పాటుపై కవిత క్లారిటి

kavitha

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంపై స్పందించారు. పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే మహిళల నుంచే ఎక్కువగా పార్టీ పెట్టాలనే డిమాండ్ వస్తోందని ఆమె చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా ఏ పార్టీ అయినా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

బీసీ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని కవిత విమర్శించారు. నివేదికలోనే ఎన్నో తప్పులు ఉన్నప్పటికీ BJP ఎందుకు మౌనం పాటిస్తోందో ప్రశ్నించారు.

కాంగ్రేస్ పార్టి బిసీలకు రిజర్వేషన్లు ఇస్తామని పచ్చి మోసంచేసిందని విమర్శించారు. రాహుల్ గాంది మెప్పుకోసం రేవంత్ రెడ్డి బిసిరిజర్వేషన్ ఎజండా తీసుకున్నాడని అన్నారు. కుల గణనలో బిసీలకు ఇన్యాయం జరిగిందని వారి జనాబా తగ్గడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

కాంగ్రేస్ పార్టి బిసిలకు ద్రోహం చేసిన పార్టీగా మిగిలి పోతుందని అన్నారు. గ్రామ పంచాయితీల వారీగా బీసిల గణాంకాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రేస్ పార్టి ఉన్నంత వరకు బిసీలకున్యాయం జరగదని అన్నారు. పనికిరాని కాంగ్రేస్ పార్టిగద్దెలు గ్రామాలలో కూల్చాలని కవితబిసినేతలకు పిలుపు నిచ్చారు.

బీఆర్ఎస్‌పై ప్రశ్నలు రావడంతో, ఆ పార్టీ గురించి మాట్లాడాలని లేదని కవిత స్పష్టం చేశారు. తాను మాట్లాడితే వక్రీకరించి తమను బద్నాం చేస్తారని ఆరోపించారు. అయితే జాగృతి తరఫున మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని, గ్రామాలన్నింటిలో బీసీలు భారీగా నామినేషన్లు దాఖలు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో బీసీ అభ్యర్థులు గెలుస్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు.

బీసీ జేఏసీ, బీసీ హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల కార్యక్రమాల్లో పాల్గొంటామని కవిత చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్నంతకాలం బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణమని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు అసలైన చిత్తశుద్ధి లేదని కవిత అన్నారు.

I

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు