కరీంనగర్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డ్రగ్ నియంత్రణ అధికారులు
కరీంనగర్ జిల్లా డ్రగ్స్ నియంత్రణ పరిపాలన కార్యాలయంలో పనిచేసే అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదుదారునికి చెందిన ఫార్మసీ వార్షిక తనిఖీ నిర్వహించినందుకు ప్రతిఫలంగా రూ.20,000 లంచం స్వీకరించిన కేసులో ముగ్గురు వ్యక్తులnu తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) అధికారులు పట్టుకుని జైలుకు తరలించారు.
ఈ కేసులో సహాయ సంచాలకుడు మర్యాల శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్, అలాగే ప్రైవేట్ వ్యక్తి పుల్లూరి రాము లు ఉన్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు.
అవినీతి నిరోధకశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ— ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని సూచించారు. అదనంగా,
• వాట్సాప్: 9440446106
• ఫేస్‌బుక్: Telangana ACB
• ఎక్స్ (Twitter): @TelanganaACB
• వెబ్‌సైట్: acb.telangana.gov.in
ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
అవినీతి నిరోధకశాఖ హామీ ఇస్తూ, “ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని స్పష్టం చేసారు.