జగదేకవీరుడు..అతిలోకసుందరి..

CHIRU SREEDEVI

ఇంద్రజ మ్యాజిక్..
రాజు లాజిక్..!

జగదేకవీరుడు..
అతిలోకసుందరి..

అది 1990 మే 9..
రాష్ట్రం అతి భీకరమైన తుపాను తాకిడితో
అల్లాడిపోతోంది..
ఎక్కడికక్కడ జనజీవితం
అతలాకుతలం అయి ఉంది.
విద్యుత్ వైర్లు తెగిపోయి
సరఫరా నిలిచి ఎప్పుడు
తిరిగి వస్తుందో తెలియని
భయానక పరిస్థితి..
అప్పుడు పెట్టారు వైజయంతి
మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా విడుదల…ఈ సమయంలో బొమ్మ రిలీజ్ చేస్తే బొమ్మ కనిపించదా అనుకుంటే దిమ్మ తిరిగేలా కొట్టింది హిట్టు..
రికార్డులను తిరగరాస్తూ..
మొదట్లో సినిమా జనాలకు ఎక్కలేదు..నానాటికీ ఎక్కింది కిక్కు..మరోవైపు ఇతర సినిమాల విడుదల తుపాను..
ఈ సినిమా సృష్టిస్తున్న వసూళ్ల సుడిగాలి కారణంగా వాయిదా పడడంతో తిరుగులేకుండా పోయింది..చిరంజీవిని ఇంకో లెవెల్ కి తీసుకుపోయింది.
అంతకు ముందు చిరంజీవి శ్రీదేవితో కలిసి రాణి
కాసుల రంగమ్మ..ఇదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో
మోసగాడు సినిమాలు చేసి ఉన్నా అప్పటికి అతడు పెద్ద స్టార్ కాకపోవడం..ఆ సినిమాలు ప్లాప్ కావడంతో
అవి ఎవరికీ గుర్తు లేకుండా పోయాయి.. సో..చిరు శ్రీదేవితో
నటించడం అదే మొదటిసారి
అని చాలా మంది అనుకున్నారు..చిరంజీవి..
శ్రీదేవి కాంబినేషన్ అదిరిపోయింది.ఇద్దరూ నృత్యంలో స్పెషలిస్టులు కావడం పెద్ద అసెట్..పాటలు అదిరిపోయాయి..స్టెప్పులు పిచ్చెక్కించాయి..కలెక్షన్లు
సంచలనం సృష్టించాయి.

ఈ సినిమా విడుదలై
ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి కావడం..శ్రీదేవి లేకపోయినా హీరో చిరంజీవి..
నిర్మాత అశ్వినీదత్..
దర్శకుడు రాఘవేంద్రరావు
ఇంద్రకుమారి ఇంద్రజ గురించే మాట్లాడుకుంటూ సినిమా రీరిలీజ్ సందర్భాన్ని హైలైట్ చేసారు.

కాగా..ఇదే సందర్భంలో
జగదేకవీరుడు అతిలోకసుందరి.. సినిమా
రీమేక్ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
చిరంజీవి కొడుకు
రామ్ చరణ్ హీరో…శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్..
ఆలోచన బానే అనిపించవచ్చు..
అయితే పోలిక తప్పదు..
ఎంత శ్రీదేవి కూతురైనా
మళ్ళీ ఇంద్రజను ఆవిష్కరించడం కాస్త దుర్లభమే..దుస్సాహసం అవుతుందేమో..ఏమో కాదు..
అవుతుంది..ఇంద్రజ అంటే శ్రీదేవే..ఆ ముగ్ధ మనోహర రూపం..ముద్దు మాటలు..
ఆ పాత్రలో మరొకరిని
చూడడం సంగతి అటుంచితే
ఊహించడమే కష్టం..!

👆ఇది నా అభిప్రాయం..
చదివారుగా..
👇ఇక ఈ సినిమా గురించి
నా రచన చదవండి..

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

ఎక్కడి ఇంద్రకుమారి..
ఎక్కడి రాజు..
భూలోకంలో అదెంత తుపాను..
వసూళ్ల వర్షం..
జనం హర్షం..!

శ్రీదేవి రూపం..
చిరంజీవి హీరోయిజం..
దర్శకేంద్రుడి మాయాజాలం..
అబ్బా అనిపించిన సినిమా..
అబ్బ నీ తీయని దెబ్బ..
అతడు పురుషుల్లో పుంగవ..
ఉంగరం కోసం
ఇంద్రజ తెగువ..
మొత్తంగా..
జగదేకవీరుడు..
అతిలోక సుందరి..
మండువేసవిలో
వినోదాల జల్లు..
కోవెలమూడి హరివిల్లు..!

అందాలలో
అహో మహోదయం..
భూలోకమే నవోదయం..
అసలు ఊహకే అందని కథ
ఒకనాడు ఎన్టీఆర్
జగదేకవీరుడైతే..
మనకథలో
టూరిస్ట్ గైడ్ రాజు..
నాటి ఇంద్రకుమారి సరోజాదేవిని మించి
శ్రీదేవి హొయలు..
ఆ ముద్దు మాటలు..
మానవా..ఆ పిలుపు మానవా..వారేవా..!

పేరుకే ఫాంటసీ..
రాఘవేంద్రుని లెగసీ..
చూస్తున్నంత సేపు అదోలాంటి అనుభూతి..
అమ్రిష్ పురి అషాడభూతి..
వెరసి జగదేకవీరుడు..
అతిలోకసుందరి..
ప్రత్యేకరీతి..!

సురేష్ కుమార్..ఇ
9948546286

Share this post

6 thoughts on “జగదేకవీరుడు..అతిలోకసుందరి..

  1. xn88 casino sở hữu kho game phong phú với hơn 500 trò chơi được phát triển bởi các nhà cung cấp hàng đầu như Evolution Gaming, Microgaming và NetEnt. Điều này đảm bảo chất lượng đồ họa sắc nét và trải nghiệm chơi game mượt mà trên mọi thiết bị.

  2. Ứng dụng app xn88 có một bộ sưu tập slot game 3D vô cùng đa dạng và hấp dẫn. Những trò chơi này được thiết kế với đồ họa 3D sống động, âm thanh chân thực và các chủ đề phong phú từ phiêu lưu, cổ tích đến các câu chuyện thần thoại.

  3. Sảnh chơi bắn cá tại xn88 tuy ra mắt đã lâu nhưng sức hút mang lại trong cộng đồng cược thủ chưa từng hạ nhiệt. Thành viên tham gia được hóa thân thành những ngư thủ thực thụ, chinh phục đa dạng loài sinh vật biển với nhiều mức độ khác nhau. Anh em cần chuẩn bị các dụng cụ hỗ trợ tương ứng, vũ khí hiện đại để có thể săn về cho mình những boss khủng, cơ hội kiếm số tiền lớn nhé.

  4. Nếu bạn đang tìm kiếm một sân chơi giải trí trực tuyến ổn định, hiện đại và đa dạng trò chơi, 888slot app chính là lựa chọn đáng để trải nghiệm. Với hệ thống trò chơi phong phú như: Bắn Cá Đổi Thưởng, Mini Game Đá Gà, Xổ Số Ba Miền, Thể Thao Điện Tử,… Tại đây mang đến không gian giải trí sống động, phù hợp với nhiều đối tượng người dùng.

  5. Nếu bạn đang tìm kiếm một sân chơi giải trí trực tuyến ổn định, hiện đại và đa dạng trò chơi, 888slot app chính là lựa chọn đáng để trải nghiệm. Với hệ thống trò chơi phong phú như: Bắn Cá Đổi Thưởng, Mini Game Đá Gà, Xổ Số Ba Miền, Thể Thao Điện Tử,… Tại đây mang đến không gian giải trí sống động, phù hợp với nhiều đối tượng người dùng.

  6. raja slot365 IM và TF Gaming chắc chắn sẽ không làm bạn thất vọng khi cung cấp hơn 35+ tựa game cá cược Thể thao điện tử cực kỳ hấp dẫn. Bạn có thể xem nhanh tỷ lệ cược sớm – trước trận đấu để bắt ngay kèo thơm cho riêng mình: Kèo chấp bản đồ, kèo tổng số Round, kèo Chẵn/Lẻ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన