ఇప్పపూల గిరి వికాసం – ప్రధాన మంత్రి ప్రశంసలు అందుకున్న ఆదివాసీ మహిళల విజయగాధ


ఉట్నూర్, నవంబర్ 9:
ఆదివాసీ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన చేయూత వారి స్వావ లంబనకు తోడు పడింది.

గిరిజన మహిళల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉట్నూర్ ఐటిడిఏ నైపుణ్యాభివృద్ధి విభాగం మార్గనిర్దేశనంలో ఆదివాసి మహిళలు సాధించిన విజయగాధ ప్రశంసలు అందుకుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీరి విజయగాధను మన్ కిబాత్ లో ప్రస్తావించి అభి నందించారు.
ప్రకృతిసిద్ధమైన ఆహార పదార్థాల ప్రాధాన్యత పెరుగుతున్న ఈ కాలంలో, ఆదివాసీ జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన ఇప్పపువ్వు ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోంది. ఈ సహజ వనరును ఉపయోగించి ఆదివాసీ మహిళలు లడ్డూల తయారీలో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు 12 మంది మహిళలను పంపించి, ఇప్పపువ్వు లడ్డు తయారీపై శిక్షణ ఇవ్వడం జరిగింది. అనంతరం ఉట్నూర్‌లో రూ.40 లక్షల వ్యయంతో లడ్డు తయారీ యూనిట్‌ను స్థాపించారు. ఇందులో TRICOR నుండి 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం మహిళల వాటాగా చెల్లించారు.
జాతీయ పోషకాహార సంస్థ (NIN) సూచనల ప్రకారం, ఇప్పపువ్వుతో పాటు పల్లీలు, నువ్వులు, బెల్లం, కాజు, ఎండు ద్రాక్షలను ఉపయోగించి సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో పోషక విలువలతో కూడిన లడ్డూలను తయారు చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం మార్చిలో కుమరం భీం–ఆసిఫాబాద్ జిల్లాల నుండి సుమారు 150 క్వింటాళ్ల ఇప్పపువ్వును సేకరించి ఐటిడిఏ గోదాంలో నిల్వ చేస్తున్నారు. దీంతో దాదాపు 100 కుటుంబాలు నేరుగా లబ్ధి పొందుతున్నాయి.
గిరిజన పోషణ మిత్ర పథకం కింద ఉట్నూర్ పరిధిలోని 77 ఆశ్రమ పాఠశాలలకు ప్రతి నెల 2,300 కిలోల ఇప్పపువ్వు లడ్డూలను సరఫరా చేస్తున్నారు. అలాగే ఓపెన్ మార్కెట్‌లో ప్రతి నెల 900 కిలోలు విక్రయిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలకు కిలో రూ.320, ఓపెన్ మార్కెట్‌లో రూ.360 ధరకు అమ్ముతున్నారు.
హైదరాబాద్‌లోని శిల్పారామం, బాలాపూర్ ప్రాంతాల్లో ఇప్పపువ్వు లడ్డు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అక్కడ ఆదివాసీ మహిళలే విక్రయిస్తున్నారు. శిల్పారామంలో వారానికి 15 కిలోలు, బాలాపూర్‌లో 25 కిలోల లడ్డూలు విక్రయమవుతున్నాయి. అదనంగా ప్రతి సోమవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో ప్రజాదర్బార్ సందర్భంగా ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
భీం భాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం నిర్వాహకురాలు భగూ భాయి తెలిపారు कि ఇప్పపువ్వు లడ్డూల తయారీ, విక్రయం ద్వారా వార్షికంగా రూ.1.27 కోట్ల టర్నోవర్ సాధించామని, సంఘానికి ప్రతి నెల రూ.3 లక్షల లాభం వస్తోందని తెలిపారు.
ఉట్నూర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆదివాసీ మహిళల కృషిని అభినందించారు. వారి ఆర్థిక స్వావలంబనను ప్రశంసించారు.
మహిళల ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ “మన కీ బాత్” కార్యక్రమంలో ప్రస్తావించిన విషయం దేశ వ్యాప్తంగా స్ఫూర్తి నిచ్చింది. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల ఆధారంగా ఆర్థికాభివృద్ధికి, మహిళా సాధికారతకు ఇది ఒక ప్రతీకగా కొనియాడుతున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు