9999 ఫ్యాన్సీ నంబర్‌ క్రేజి 12.60 లక్షలు

car fancy gighest bid

హనుమకొండ:వాహనాల ఫ్యాన్సీ నంబర్ల క్రేజి బాగాపెరిగి పోయింది. హనుమకొండలో వాహన నంబర్ వేలంలో TGA 03A 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌కు రూ.12.60 లక్షల భారీ ధర పలికింది. ఈ నంబర్‌ను హనుమకొండకు చెందిన కావేరీ ఇంజనీరింగ్ సంస్థ సొంతం చేసుకుంది.

ఆర్టీఏ అధికారులు చింతగట్టు క్యాంపులో నిర్వహించిన వేలంలో ఈ నంబర్ కోసం చాలా మంది పోటిపడ్డారు. ముందుగా రూ.50,000 బేస్ ధరగా నిర్ణయించినప్పటికీ, నంబర్‌పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో బిడ్లు లక్షల్లో దూసుకెళ్లాయి. మే 27న జరిగిన ఆన్‌లైన్ వేలంలో కావేరీ ఇంజనీరింగ్ సంస్థ ఏకంగా రూ.12.60 లక్షలు చెల్లించి ఈ నంబర్‌ను దక్కించుకుంది.

ఈ నంబర్ కోసం పలువురు రూ.12 లక్షల వరకు బిడ్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు. చివరికి అత్యధిక బిడ్ ఇచ్చిన కావేరీ ఇంజనీరింగ్‌కి ఇది దక్కింది. ఇంతక్రేజీనా ఈధరతోమరోకారువచ్చేదికదా అంటూ ఈవార్త విన్నవారంతా కామెంట్లు చేశారు.

Share this post

One thought on “9999 ఫ్యాన్సీ నంబర్‌ క్రేజి 12.60 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి