ప్రతి హిందువు
ఆత్మ పరిశీలన చేసుకోవాలి..
ఎవరో అంటున్నారని కాదు కాని…
ఈ ప్రశ్నలకు బదులేది..!?
ఒక ముస్లిం మహిళా రచయిత హిందూ సమాజంపై సంధించిన ఈ పది ప్రశ్నలను ఒక్కసారి పరికించండి..
దేశంలో ఎక్కడ ఏం జరిగినా ముస్లిముల మీద విరుచుకుపడిపోతున్న ప్రస్తుత
తరుణంలో ఈ ప్రశ్నలు మనకి చురకలు కాదు చరుపులు..
ఆ రచయిత రాశారని కాదు గాని..నిజంగా ప్రతి హిందువు
ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన
సమయం..సందర్భం..
ఇంతకీ ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూడండి..
1)మీ హిందూ స్త్రీలు ఒకప్పుడు ముఖంపై ముసుగుతో కనిపించేవారు..
ఇప్పుడు చాలా మంది
చీర కట్టుకోడమే మానేశారు..
డ్రస్సులు వేసుకుంటున్నా చున్నీలు వదిలేశారు..
దీనికి కారణం ఎవరు. ముస్లిములా..?
2)హిందూ స్త్రీకి పెద్ద అలంకారం బొట్టు..నుదుటిన రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని నిండుగా కనిపించేవారు హిందూ స్త్రీలు.. ఇప్పుడు అలా కనిపించే హిందూ స్త్రీలు తక్కువైపోయారు.. కనీకనిపించని బొట్టు..
దాని పేరు స్టిక్కర్..!
ఈ మార్పుకు
కారణం ముస్లిముల
ఉద్భోధా..ఉగ్రవాదమా..?
3)పెళ్ళిళ్ళలో సంప్రదాయాలు ఎన్నిటికో తిలోదకాలిచ్చి
పెళ్లికి ముందే అబ్బాయిని..అమ్మాయిని
ప్రీ వెడ్డింగ్ షూట్లంటూ తిప్పుతున్నారు..
ఇక పుట్టినరోజు వేడుకలు ఎటూ పాశ్చాత్య పోకడల్లోనే..
ఇదంతా మా తప్పా..?
4)మా ఇళ్లలో ఊహ తెలిసినప్పటి నుంచి
ఓ పిల్లాడు తండ్రి చెయ్యి పట్టుకుని మసీదుకి వెళ్ళడం నేర్చుకుని ఆ అలవాటును..
సంప్రదాయాన్ని జీవిత పర్యంతం కొనసాగిస్తాడు.
హిందువుల పిల్లలు అంత నిబద్దంగా గుడికి వెళ్తున్నారా..
పెద్దవాళ్ళు సైతం గుడికి వెళ్ళినా కొంతసేపే ఉండడం.. ఈలోగా దేవుణ్ణి బోలెడు కోరికలు కోరడం..అక్కడ కూడా ఆసుకు..లేదా ఫోన్ చూసుకోవడం..
ఈ రకమైన ప్రవర్తనకి
మేమా కారణం..?
5)మీ పిల్లలు కాన్వెంట్ చదువులు చదువుతూ
ఇంగ్లీష్ పోయెమ్స్ టకటకా చదివేస్తుంటే మీరు పొంగి పోతారు..మీ పిల్లలకి గాయత్రి తదితర మంత్రాలు మీరు నేర్పిస్తున్నారా..అసలు మీకు
ఆ ధ్యాస ఉందా..
మేము మా పిల్లలకి ఇంటికి ఎవరు వచ్చినా
సలాం అనడం నేర్పిస్తున్నాం..
మీరు నమస్కారం పెట్టడం నేరిస్తున్నారా..ఇపుడంతా హలో..హాయ్..అంటున్నారని మీకూ తెలుసు..
దీనికీ మమ్మల్ని బాధ్యులను
చేస్తారా..
6)మా మతంలో పిల్లలు కాన్వెంట్లో చదువుతున్నా
ఉర్దూ నేర్చుకుంటారు..
మా పవిత్ర గ్రంథాలు చదువుతారు.
మీ పిల్లలు మాతృభాష సరిగ్గా పలకలేని దుస్థితిలో ఉన్నారా లేదా..గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి..
మాతృభాషలో సరిగ్గా మాట్లాడలేని వారు
భగవద్గీత ఇంకేమి చదువుతారు..
అదీ మా తప్పేనా!?
7)హిందువులకు
గొప్ప సంస్కృతి ఉంది..
చరిత్ర ఉంది..
సంప్రదాయాలు ఉన్నాయి.. కాని ఆధునికత మోజులో మీరు వాటిని ఎపుడో మర్చిపోయారు..
మూలాలను వదిలేస్తున్నారు..
మేము అలా చెయ్యలేదే..
8)ప్రతి మతానికి
ఒక ముద్ర ఉంటుంది..
గుర్తింపు ఉంటుంది..
మీరు ఆ విషయంలో
మీ మతస్థులని
జాగృతం చేసే పరిస్థితిలో ఉన్నారా లేదా..!?
9)మీ మూలాల విషయంలో మీలో తలెత్తిన అభద్రతాభావానికి మేమా కారణం..?
10) మీలో చాలా మంది హిందూ సమాజం మేలుకోవాలని చెప్పేవారే..
అయితే మీలో ఎందరు
ఆ విషయంలో ముందు నిలబడి మార్గదర్శనం చేస్తున్నారు..చెప్పండి..
మీరు మీలాగే ఉంటారు..
సమాజం మారాలని సందేశాలు ఇస్తారు..
మీకు తోచదు..
గురువులు చెబితే వినరు..
ఎవరిది బాధ్యత..
(ఆంగ్ల రచనకు స్వేచ్ఛానువాదం..)


Thanks – Enjoyed this blog post, is there any way I can get an update sent in an email when you make a new article?
Good day very cool site!! Guy .. Excellent .. Superb .. I will bookmark your site and take the feeds additionally…I am glad to seek out numerous useful info right here in the post, we want work out more strategies on this regard, thank you for sharing.
My partner and I stumbled over here from a different website and thought I may as well check things out. I like what I see so i am just following you. Look forward to finding out about your web page again.
you will have an incredible weblog right here! would you prefer to make some invite posts on my weblog?
It is in reality a great and helpful piece of information. I’m glad that you simply shared this helpful info with us. Please stay us up to date like this. Thanks for sharing.