జనగాం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో క్షేత్ర ఇంజనీర్ గా పొరుగు సేవల పై పనిచేస్తున్న ఉద్యోగి సామల రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
ఫిర్యాదుదారుడు ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం క్రింద పూర్తిచేసిన నిర్మాణ పనులకు సంబంధించిన చివరి బిల్‌ను ప్రాసెస్ చేసి తదుపరి చర్యల కోసం పంపించేందుకు అధికారిక సహాయం అందించాలన్న కారణంగా, రమేష్ మొదటగా రూ.18,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అందులో ముందుగానే రూ.10,000 తీసుకున్న రమేష్, మిగతా రూ.8,000 తీసుకుంటూ 25.09.2025 భాధితుని ఫిర్యాదుతో, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ప్రజలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినపుడు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.


Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
Useful information. Fortunate me I found your website unintentionally, and I’m shocked why this twist of fate did not took place earlier! I bookmarked it.
Useful information. Lucky me I discovered your site accidentally, and I am stunned why this twist of fate didn’t happened in advance! I bookmarked it.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Would you be desirous about exchanging links?