డిసిసి బ్యాంకుల నూతన ప్రాంగణాలు సహకార ఎరువుల గోదాము ప్రారంభించిన మంత్రి సీతక్క -చైర్మన్ రవీందర్ రావు

mulugu dccb branch

మలుగు నియోజక వర్గంలో జిల్లా సహకారకేంద్ర బ్యాంకుల నూతన ప్రాంగణాలను ఎరువలు నిల్వ చేసే గోదాములను మంత్రిసీతక్క,


తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు ప్రారంభించారు.

మంగళవారం జిల్లా కేంద్రం లో డి సి సి బ్యాంకు ములుగు బ్రాంచి నూతన ప్రాంగణం తో పాటు ఏటూరునాగారం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రాంగణాన్ని ప్రారంభించారు.
అట్లాగే మంగపేట మండల కేంద్రంలో నిర్మించిన గోదాం ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూర్యసీతక్క మాట్లాడుతు మన ప్రభుత్వం ఏర్పడ్డాక డిసిసి సహకార బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ లేని రుణాలు, గోల్డ్ లోన్, మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామని, మారుమూల ప్రాంతాలలో రైతులకు చేరువలో ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని, 2018 నుండి డిసెంబర్ 2023 వరకు అందరికీ రైతు ఋణ మాఫీ చేయడం జరిగిందని, దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో 9 రోజులలో 9 వేల కోట్లు రైతు ఖాతాలో జమ చేశామని, క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతు సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతుల యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని ఏటూరు నాగారంలో ఈ బ్యాంకు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు మాట్లాడుతు రైతులకు,ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఇక్కడ నూతన భవనం లోకి రావడం సంతోషంగా ఉందని, డిసిసిబి ఏర్పడిన నుండి ఇప్పటివరకు బ్యాంకులను లాభాల బాటలో తీసుకెళ్తున్నామని,2024- 25 సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లా డిసిసిబి బ్యాంకులు 2వేల 296 కోట్ల రూపాయల పై చిలుకు లాభాలతో ముందుకు వెళ్తున్నామనీ,ములుగు మున్సిపాలిటీ మరియు ఏటూరునాగరం చుట్టుపక్కల ప్రాంతాల ఖాతాదారులకు మరియు రైతులకు వ్యవసాయ రుణాలు,కర్షక మిత్ర రుణాలు,బంగారు రుణాలు, విద్యా రుణాలు ఇస్తున్నామని రాబోయే రోజుల్లో బ్యాంక్ సేవలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని తెలిపారు..

ఈకార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ MD. వజీర్ సుల్తాన్, ఆడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డిసిసిబి జీఎం ఉషా శ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎం స్రవంతి, మేనేజర్లుకె.నరేందర్,తిరుపతి, తహసిల్దార్ విజయ భాస్కర్, డీసీసీబ్యాంక్ పాలక వర్గ సభ్యులు మాడుగుల రమేష్, పోలేపాక శ్రీనివాస్, కక్కిరాల హరిప్రసాద్, దొంగల రమేష్,
కొండ నరేందర్, లోకల్ పాక్స్ చైర్మన్స్
బొక్క సత్తి రెడ్డి,కాసర్ల కుమార స్వామి,
పన్నాల ఎల్లారెడ్డి, బ్యాంకు సిబ్బంది, సొసైటీ సిబ్బంది,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి