.
ములుగు జిల్లా పస్ర తాడ్వాయి మద్యలో జలగలంచ వాగులో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ సందర్శకుల కోసం పున ప్రారంభించారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. శుక్రవారం రాత్రి బ్లాక్ బెర్రీ ఐలాండ్ పున ప్రారంభించి వసతి సౌకర్యాలు పరిశీలించారు.
ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ఒకటని ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయని పర్యాటకులు బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ను సందరించండి అని మంత్రి సీతక్క కోరారు.
మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.








