ఉగ్రవాదం ఉపేక్షించేది లేదు– సింధూ జలాలపై హక్కు వదులుకోబోము -ప్రధాన మంత్రి నరేంద్రమోది

pmmodiindependence day

న్యూఢిల్లీ: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని 12వ సారి ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశ సమైక్యత, ఉగ్రవాదంపై కఠిన వైఖరి, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలను ప్రస్తావించారు.

★ త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం – కోట్లాది ప్రజల త్యాగాలతో దేశం స్వేచ్ఛను సాధించిందని మోదీ గుర్తుచేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాల్గొన్న వీర జవాన్లకు సెల్యూట్‌ చేశారు.

★ ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక – ఉగ్రవాదం మానవాళికి ముప్పు అని, దానిని ప్రోత్సహించే వారిని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. “నీరు, రక్తం కలిసి ప్రవహించవు” అంటూ పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చారు.

★ సింధూ జలాలపై – సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించే ఆలోచనలో మార్పు లేదని చెప్పారు. సింధూ ఒప్పందంపై చర్చలే ఉండవని స్పష్టం చేశారు.

★ ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా – రక్షణ రంగం నుంచి ఈవీ బ్యాటరీల తయారీ వరకు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మిషన్‌ వేగంగా కొనసాగుతోందన్నారు. 2047 నాటికి న్యూక్లియర్‌ ఎనర్జీని 10 రెట్లు పెంచాలనే లక్ష్యాన్ని వెల్లడించారు.

★ భవిష్యత్‌ సాంకేతికతలో భారత్‌ అడుగులు – అంతరిక్ష పరిశోధనల నుండి సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాల పరిశోధన వరకు దేశం ముందుకు సాగుతోందని తెలిపారు. రసాయన ఎరువుల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఉటంకించారు.

ఉగ్రవాదం ఉపేక్షించేది లేదు– సింధూ జలాలపై హక్కు వదులుకోబోము

ఎర్రకోటపై 12వసారి జాతీయ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం త్రివర్ణ పతాకంతో ముస్తాబైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశ సమైక్యత, ఉగ్రవాదంపై కఠిన వైఖరి, సింధూ జలాల హక్కు, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ స్వాతంత్య్రం అనేది కోట్లాది భారతీయుల త్యాగ ఫలమని గుర్తుచేస్తూ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో వీర జవాన్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. “వీరజవాన్లకు సెల్యూట్‌ చేసే అవకాశం రావడం నా గౌరవం” అని అన్నారు.

ఉగ్రవాదానికి తావు లేదు
పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులను భారత్ ఎంతమాత్రం సహించబోదన్నారు. “ఉగ్రవాదం మానవాళికి ముప్పు” అని మోదీ స్పష్టం చేశారు. మతం పేరుతో జరిగిన పహల్గాం నరమేథం ఉదహరిస్తూ, ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. “నీరు, రక్తం కలిసి ప్రవహించవు” అంటూ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు.

సింధూ జలాలపై హక్కు
సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించే నిర్ణయంలో మార్పు లేదని, సింధూ ఒప్పందంపై చర్చల ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. ఏడు దశాబ్దాలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ జలాలను చేరుస్తామని తెలిపారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ – రక్షణ నుంచి సాంకేతికత వరకు
మేక్‌ ఇన్‌ ఇండియా మిషన్‌ రక్షణ రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఫైటర్‌ జెట్లకు మేడిన్‌ ఇండియా ఇంజిన్లు, కొత్త ఇందనాలు, ఈవీ బ్యాటరీ ఉత్పత్తి, కీలక ఖనిజాల పరిశోధన, సెమీ కండక్టర్‌ తయారీ వంటి రంగాల్లో దేశం ఆత్మనిర్భర్‌ దిశగా అడుగులు వేస్తోందని వివరించారు. 2047 నాటికి న్యూక్లియర్‌ ఎనర్జీని 10 రెట్లు పెంచే లక్ష్యాన్ని వెల్లడించారు.

భవిష్యత్‌ దిశ
రసాయన ఎరువుల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు అవసరమని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో గగన్‌యాన్‌ మిషన్‌ విజయాన్ని ప్రస్తావిస్తూ, భారత శక్తి ప్రపంచానికి తెలిసిందని అన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి