దత్తాత్రేయ జీవితం యువతకు మార్గదర్శకం.. సీఎం రేవంత్ రెడ్డి

“ప్రజల కథే… నా ఆత్మకథ” గవర్నర్ బండారు దత్తా త్రేయ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, శిల్పకళావేదిక:
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే… నా ఆత్మకథ” అనే ఆత్మకథా గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం శిల్పకళా వేదికలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. బండారు దత్తాత్రేయ జీవన ప్రయాణం దేశ ప్రజల సేవలో ఎలా కేటాయించారన్నది ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందన్నారు. “ఆయన జీవితం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది,” అని ముఖ్యమంత్రి అన్నారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ట్రిపుర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు బండారు దత్తాత్రేయ గారి సేవలను, ఆయన రాజకీయ జీవితం, ప్రజల పట్ల నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు రచయిత ధన్యవాదాలు తెలిపారు.

ఈ పుస్తకం ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ, సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ, ప్రజల జీవితం, సమస్యలు, ఆశయాలు తన జీవితంలో ఎలా భాగమయ్యాయన్న దానిపై దత్తాత్రేయ లోతైన ఆలోచనల సమాహారంగా నిలిచిందని అహుతులు కొనియాడారు.

Share this post

2 thoughts on “దత్తాత్రేయ జీవితం యువతకు మార్గదర్శకం.. సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన