మీదగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా…. డోన్ట్ వర్రీ

rs 2000


ఇప్పటికి ఎవరివద్దనైనా రూ.2000 నోట్లు ఉండి ఉంటే మీరు నేరుగా ప్రధాన నగరాల్లో ఉన్న రిజర్వుబ్యాంకాఫ్ ఆఫ్ ఇండియా కార్యాలయాలకు వెళ్లి వాటిని మీబ్యాంకు ఖాతాలలో జమచేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో 19 నగరాలలో ఇలాంటి సదుపాయం ఉంది. అహ్మదాబాద్ • బెంగళూరు • బేలాపూర్ • భోపాల్ • భుబనేశ్వర్ • చండీగఢ్ • చెన్నై • గౌహతి • హైదరాబాద్ • జైపూర్ • జమ్మూ • కాన్పూర్ • కోల్‌కతా • లక్నో • ముంబై • నాగపూర్ • న్యూ ఢిల్లీ • పాట్నా • తిరువనంతపురం.

  • ఆర్ బిఐ కార్యాలయాలలో మార్చుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల వారు హైదరాబాద్ ఆర్ బిఐ లో జమచేసుకోవచ్చు.

ఒకవేళ మీరు ఆర్బిఐకివెళ్లలేని పరిస్థితిలో మరోసౌలభ్యం కూడఉంది. మీసమీపంలోని పోస్టల్ కార్యాలయం ద్వారా ఆర్బిఐకి రూ2000 నోట్లను పంపుకుని మీబ్యాంకు ఖాతాల్లో జమచేసుకునే సౌలభ్యం కూడ ఉంది. పోస్టల్ కార్యాలయాల్లో వివరాలుఅడిగితేచెబుతారు. ఇందుకోసం బ్యాంకుఅక్కౌంట్ వివరాలతో ఒకఫాం నింపి నోట్లను జతచేయాల్సిఉంటుంది.
ఆర్‌బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 98.08% తిరిగి వచ్చాయి. అయినప్పటికీ, మిగిలిన నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన చెల్లుబాటు కలిగి ఉన్నాయి. ఈ నోట్లను డిపాజిట్ చేయడం, మార్చుకోవడం సాధారణంగా కుదరదు.
2016 నవంబర్ లో కేంద్రం వెయ్యి,ఐదువందల నోట్లను రద్దు చేసింది. అనంతరం అధిక విలువ కలిగిన రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. తర్వాత 2023లో ఈ నోట్లను చెలమాని నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. 23 అక్టోబర్ 2023 వరకు అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను స్వీకరించారు. ఆ తర్వాత ఈనోట్లను బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం లేదు. ఆర్ బిఐ ప్రధాన కార్యాలయాల్లో బ్యాంకు అక్కౌంట్లలో జమచేసుకునే అవకాశం కొనసాగుతొంది.
ఇప్పటికి తిరిగిరాని లెక్కల్లో 6,266 కోట్ల రూ2000 నోట్లు ఉన్నాయి. చెలామని ఉహసంహరణ తర్వాత 98.24 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.
ఏ పరిస్థితిలోనైనా మీ దగ్గర రూ2000 నోట్లుు ఉంటే లేదా మీరు నిశ్చింతగా వాటిని ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో జమచేసుకోవచ్చు.

Share this post

4 thoughts on “మీదగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా…. డోన్ట్ వర్రీ

  1. I would like to thnkx for the efforts you’ve put in writing this web site. I’m hoping the same high-grade blog post from you in the upcoming as well. In fact your creative writing abilities has inspired me to get my own website now. Really the blogging is spreading its wings quickly. Your write up is a good example of it.

  2. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం