సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..
రెండు గ్రామాల్లో సర్వే వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేసిన అధికారులు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి..
రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తింపు..
సర్వే నంబర్‌లో మిస్ అయిన 45 ఎకరాల భూమి..
45 ఎకరాలు ఎక్కడుందో తేల్చాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.
భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల..
భూమి సరిహద్దులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు సబ్మిట్ చేయాలని నోటీసులు జారీ చేయనున్న అధికారులు..
సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం..
సర్వే నంబర్ 325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సకల సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేయాలని సూచన.
కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని సూచించిన సీఎం.
జూన్ 2లోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు..

