ఐ ఎల్ పి ఎ నేషనల్ ప్రెసిడెంట్ గా సుజాత చౌదంటే
ఐ ఎల్ పి ఎ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్ జె శాంసన్
నేషనల్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత
నాగపూర్ లో జరిగిన సదస్సులో నేషనల్ కమిటీ ఎన్నిక
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా నాసిక్ కు చెందిన సీనియర్ న్యాయవాది సుజాత చౌదంటే ఎన్నికయ్యారు. శనివారం మహారాష్ట్ర నాగపూర్ పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ న్యాయవాదులు హాజరై నేషనల్ కమిటీని ఎన్నుకున్నారు. పూలే, అంబేద్కర్ సిద్ధాంతంతో సామాజిక న్యాయం ఎజెండాగా బాంసెఫ్ కు అనుబంధ విభాగంగా కొనసాగుతున్న ఐ ఎల్ పి ఎ నేషనల్ ప్రెసిడెంట్ గా మహిళను ఎన్నుకొని తన సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా నిలబెట్టారు.
గత 10 సంవత్సరాలుగా న్యాయవాద సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐ ఎల్ పి ఎ అధ్యక్షుడు ఎన్ జె శాంసన్ ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ తల్వార్, ఉపాధ్యక్షులుగా సునీల్ డోంగర్ దివే, జాయింట్ సెక్రటరీగా ఉత్తరప్రదేశ్ కు చెందిన యాకుబ్ సిద్ధికి, కోశాధికారిగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన విజయ్ డేనియల్, కార్యనిర్వాహక సభ్యులుగా నూకతోట రవికుమార్ (ఆంధ్రప్రదేశ్), బ్రిజేష్ జైశ్వార్ (మహారాష్ట్ర), డి ఆర్ వాగ్మోర్ (మహారాష్ట్ర), తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం కు చెందిన సుంకర భానుప్రియ లను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నుకోబడిన జాతీయ అధ్యక్షులు సుజాత చౌదంటే, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ప్రజలకు మెజార్టీ ప్రజలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు తెలియక బానిసత్వంలో జీవిస్తున్నారని, సమాజంలో ఉన్నత విద్యావంతులైన న్యాయవాదులు ప్రజలను చైతన్యం చేయడంలో ముందుకు వచ్చినప్పుడే సమసమాజం ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐ ఎల్ పి ఎ పనితీరు దేశానికి ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని, ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సు నిర్వహించి రాష్ట్రంలో బి.సి జనగణన సాధించామని, దేశంలోనే మొదటగా మహిళా న్యాయవాదుల రాష్ట్ర సదస్సు నిర్వహించి న్యాయవాద రక్షణ చట్టం డిమాండ్ చేసి సాధించడంలో ఐ ఎల్ పి ఎ కీలకపాత్ర పోషించిందని అన్నారు. నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారికి గత 10 సంవత్సరాలుగా ఉచిత శిక్షణిస్తూ ఎంతోమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ లుగా, జడ్జీలుగా నియామకమవడానికి కృషి చేశామని, న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకుని అభివృద్ధి చెందడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఐ ఎల్ పి ఎ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా విస్తరించి బహుజన వర్గాలకు అండగా నిలిచి దేశంలో సామాజిక న్యాయం సాధించడానికి త్యాగపూరిత ఉద్యమాలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐ ఎల్ పి ఎ ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్, ఉపాధ్యక్షులు కందుకాల సురేష్, వివిధ రాష్ట్రాలకు చెందిన ఐ ఎల్ పి ఎ నాయకులు యోగేంద్ర యోగి, ధర్మేష్ సహారి, స్మిత తక్సాండే, పూనమ్, హర్షలి చౌబే, విశ్వరూప తదితరులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన నాయకులకు ఐ ఎల్ పి ఎ నాయకులు తీగల జీవన్ గౌడ్, చిల్ల రాజేంద్రప్రసాద్, సామ హేమలత, మామిడాల సత్యనారాయణ, బిచాల తిరుమలరావు, గోపికృష్ణ, భుజంగరావు, వెంకటేష్ ప్రసాద్, నిజామోద్దీన్, దయ్యా రాజారామ్, నర్సయ్య, మగ్గిడి నర్సయ్య, సిద్ధిరాములు, హాస్సెన్, వెంకటస్వామి, విలాసాగరం సురేందర్, పూసపాటి శ్రీనివాస్, తిరుపతి, టి.లక్ష్మీదేవి, బిక్షమయ్య, మూర్తి, మర్రి గంగాధర్, ఆదోని లత, సుమలత, సాధిక్ పాషా, దయాల సుధాకర్, టి హేమలత, రంగోజు బిక్షపతి, బద్రు, పరశురాజ్, గాంగేయుడు, ఆవులూరి సత్యనారాయణ, కేరిత్, రేణుక, కట్ట రమేష్, మనీశ్వరి, ఎలమాద్రి రవి, కర్ణ, జన్ను పద్మ, గరిగె జ్యోతి, జన్ను ప్రభాకర్, పండుగ శ్రీనివాస్, నర్సింహా, గీతా వనజాక్షి, విజయలక్ష్మి, ఎర్రపాటి కృష్ణ, ప్రవళిక, రేష్మశ్రీ, కిషోర్ అంబెడ్కర్, మారపాక రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.







