తెలంగాణపై ఎవరు కుట్రలు చేసిన సహించేది లేదు
అల్లం నారాయణ సర్ స్పూర్తితో ఆంధ్ర తొత్తుల కుట్రలను తెలంగాణ సమాజానికి తెలియజేస్తాము
ఓరుగల్లు తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదం పురుడుపోసుకున్న ఓరుగల్లు మరో జంగ్ సైరన్ కి సిద్ధంగా ఉందని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యోధుడు, ఉద్యమ సేనాని గౌరవ అల్లం నారాయణ నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హన్మకొండలో జర్నలిస్ట్ లు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ జర్నలిస్ట్ లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు జర్నలిస్ట్ లు యాజమాన్యాల ఒత్తిడిని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారని, రాజకీయ పార్టీలకతీతంగా నాయకులందరిని ఎక్కతాటిపైకి తెచ్చారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణంలో కూడా ప్రత్యేక పాత్ర ఉందని తెలిపారు. తెలంగాణ మీద ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రజలను చైతన్యం చేయాలిసిన అవసరం ఉందని అన్నారు.
హన్మకొండ కాళోజి జంక్షన్ నుండి అమరవీరుల స్థూపం వరకు జర్నలిస్ట్ లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు కూన మహేందర్, శంకేసి శంకర్ రావు, నూర శ్రీనివాస్, వర్డెల్లి లింగయ్య, మస్కపురి సుధాకర్, కోరుకోప్పుల నరేందర్, అర్షం రాజ్ కుమార్, వాంకే శ్రీనివాస్, పోగాకుల అశోక్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, అల్లం రాజేష్ వర్మ, బూరం ప్రశాంత్, తాళ్లపల్లి వేణు గోపాల్, రవికాంత్, శ్రీకాంత్, సాల్మాన్, సంజీవ్, మిట్ట నవనీత్, నీలం శివ, గోకారపు శ్యాం, బుడిగే శ్రీనివాస్, రాంచందర్, గోకారపు సుధీర్, బండి రవి, విరగోని హరీష్, గొట్టే వెంకన్న, ఆదర్స్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

